ఐపీఎల్ 150 వికెట్ల క్లబ్ లో హర్భజన్ సింగ్

12 సీజన్లలో రెండు జట్ల తరపున 150 వికెట్లు ఢిల్లీ తో క్వాలిఫైయర్ -2లో హర్భజన్ షో 150 వికెట్ల భారత మూడో బౌలర్ హర్భజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12 సీజన్లలో 150 వికెట్లు సాధించిన భారత మూడో బౌలర్ గా చెన్నై సూపర్ కింగ్స్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రికార్డుల్లో చేరాడు. విశాఖ ఏసీఏ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో ముగిసిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లో భజ్జీ 4 ఓవర్లలో 31 […]

Advertisement
Update:2019-05-11 02:30 IST
  • 12 సీజన్లలో రెండు జట్ల తరపున 150 వికెట్లు
  • ఢిల్లీ తో క్వాలిఫైయర్ -2లో హర్భజన్ షో
  • 150 వికెట్ల భారత మూడో బౌలర్ హర్భజన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12 సీజన్లలో 150 వికెట్లు సాధించిన భారత మూడో బౌలర్ గా చెన్నై సూపర్ కింగ్స్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రికార్డుల్లో చేరాడు.

విశాఖ ఏసీఏ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో ముగిసిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లో భజ్జీ 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టడం ద్వారా ఈ ఘనత సొంతం చేసుకొన్నాడు.

గతంలో ముంబై ఇండియన్స్ కు, ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న హర్భజన్ సింగ్…ప్రస్తుత సీజన్ 16వ మ్యాచ్ లో ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్, మిడిలార్డర్ ఆటగాడు షెర్ఫాన్ రూథర్ ఫోర్డ్ ను పడగొట్టాడు.

మలింగ టాప్…

ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ బౌలర్ లాసిత్ మాలింగ రికార్డు నెలకొల్పాడు.
మలింగ 121 మ్యాచ్ ల్లో 169 వికెట్లు పడగొట్టాడు.

భారత బౌలర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా 147 మ్యాచ్ ల్లో 157 వికెట్లు, కోల్ కతా నైట్ రైడర్స్ లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా 157 మ్యాచ్ ల్లో 150 వికెట్లు సాధించారు. ప్రస్తుత సీజన్లో హర్భజన్ 150 వికెట్లు సాధించడం ద్వారా ఈ ముగ్గురు బౌలర్ల సరసన చోటు సంపాదించాడు.

ప్రస్తుత సీజన్ మ్యాచ్ ల పవర్ ప్లే ఓవర్లలోనే హర్భజన్ అత్యధిక వికెట్లు సాధించడం మరో రికార్డుగా మిగిలిపోతుంది.

Tags:    
Advertisement

Similar News