ఇంటర్ ఫలితాల బాధ్యత నుంచి గ్లోబరీనా అవుట్.... కొత్త సంస్థకు అప్పగింత

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించిన పరీక్షల ఫలితాలను వెల్లడించడంలో ఘోరమైన తప్పిదాలు చేసి, పలువురు విద్యార్థుల మరణాలకు కారణమైన సంస్థ గ్లోబరీనా. హాల్ టికెట్ల జారీ నుంచి ఫలితాల వెల్లడివరకు ప్రతీ దశలోనూ ఈ సంస్థ అనేకమైన పొరపాట్లు చేసింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నివేదికను అనుసరించి గ్లోబరీనా సంస్థను ఇంటర్ ఫలితాల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించారు. త్వరలో జరిగే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల నిర్వహణ నుంచి కూడా ఈ సంస్థను […]

Advertisement
Update:2019-05-11 05:44 IST

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించిన పరీక్షల ఫలితాలను వెల్లడించడంలో ఘోరమైన తప్పిదాలు చేసి, పలువురు విద్యార్థుల మరణాలకు కారణమైన సంస్థ గ్లోబరీనా. హాల్ టికెట్ల జారీ నుంచి ఫలితాల వెల్లడివరకు ప్రతీ దశలోనూ ఈ సంస్థ అనేకమైన పొరపాట్లు చేసింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నివేదికను అనుసరించి గ్లోబరీనా సంస్థను ఇంటర్ ఫలితాల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించారు.

త్వరలో జరిగే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల నిర్వహణ నుంచి కూడా ఈ సంస్థను దూరం పెట్టారు. ఇక కొత్త సంస్థను ఎంపిక చేసే బాధ్యతను తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్‌కు అప్పగించారు. దీనికి సంబంధించిన టెండర్ నోటిఫికేషన్ విడుదలైంది.

కాగా, ఈ ఏడాది నుంచి మూడేళ్ల పాటు అమలయ్యేలా 4.80 కోట్ల రూపాయలకు గ్లోబరీనాకు ఇంటర్ బోర్డు ఈ బాధ్యతలు అప్పగించింది. కాని తొలి ఏడాదే సరిదిద్దుకోలేనన్ని తప్పిదాలు చేసింది. ఫలితాల వెల్లడిలో పూర్తిగా విఫలమైంది. దీంతో ఆ సంస్థను తప్పించేశారు.

మరోవైపు కొత్త టెండర్‌లో కఠినమైన నిబంధనలు తీసుకొని వస్తున్నారు. ఇప్పటి వరకు కనీసం 10 లక్షల మంది విద్యార్థుల ఫలితాలను వాల్యుయేషన్ చేసిన అనుభవం ఉండాలని, 2015-18 మధ్య వరుసగా మూడేళ్లు ఏదేనీ ప్రభుత్వ రంగ విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో ప్రాసెసింగ్ చేసిన అనుభవం ఉండాలని పేర్కొన్నారు.

దీంతో ఎంతో అనుభవం ఉన్న సంస్థ మాత్రమే టెండర్ దక్కించుకునే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News