టీవీ9కి కొత్త సీఈవో, సీవోవో.... వాళ్ల బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

టీవీ9 సీఈవోగా రవిప్రకాష్‌ను తొలగిస్తూ అధికారికంగా నిర్ణయం వెలువడింది. రెండు రోజుల క్రితం టీవీ9 కొత్త యాజమాన్యం అయిన అలంద మీడియా సీఈవో రవిప్రకాష్ మీద ఫోర్జరీ, నిధుల మళ్లింపు విషయాలపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రవిప్రకాష్ చేసిన అక్రమాలపై కొత్త యాజమాన్యం కేసు నమోదు చేయడంతో గురువారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఈవో పదవి నుంచి రవిప్రకాష్ ను తొలగిస్తున్నట్లు మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. అయినా రాత్రి 7 గంటలకు […]

Advertisement
Update:2019-05-10 13:40 IST

టీవీ9 సీఈవోగా రవిప్రకాష్‌ను తొలగిస్తూ అధికారికంగా నిర్ణయం వెలువడింది. రెండు రోజుల క్రితం టీవీ9 కొత్త యాజమాన్యం అయిన అలంద మీడియా సీఈవో రవిప్రకాష్ మీద ఫోర్జరీ, నిధుల మళ్లింపు విషయాలపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రవిప్రకాష్ చేసిన అక్రమాలపై కొత్త యాజమాన్యం కేసు నమోదు చేయడంతో గురువారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

సీఈవో పదవి నుంచి రవిప్రకాష్ ను తొలగిస్తున్నట్లు మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. అయినా రాత్రి 7 గంటలకు సీఈవోను నేనే, నాపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్దాలు అంటూ ఏకంగా టీవీ9 స్టుడియో నుంచే రవిప్రకాశ్ ప్రకటించుకున్నారు. అయితే దీనిని సీరియస్‌గా తీసుకున్న అలందా మీడియా వెంటనే ఏబీసీఎల్ బోర్డు మీట్ంగ్ ను ఏర్పాటు చేసింది.

ఇవాళ ఉదయం నుంచి ఏకధాటిగా జరిగిన బోర్డు మీటింగ్‌లో సీఈవోగా మహేంద్ర మిశ్రా, సీవోవోగా గొట్టిపాటి సింగారావును నియమిస్తున్నట్లు ప్రకటించింది. మహేంద్ర మిశ్రా ప్రస్తుతం టీవీ9 కన్నడ ఎడిటర్, సీఈవోగా పని చేస్తున్నారు. ఆయనకు టీవీ9 తెలుగు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక సీవోవోగా నియమించిన గొట్టిపాటి సింగారావు ప్రస్తుతం 10 టీవీ సీఈవో.

ఇక బోర్డు మీటింగ్ లో చాలా ఆసక్తికర సంఘటనలు జరిగాయి. టీవీ9 ఉద్యోగులందరినీ పిలిచి.. కొత్త యాజమాన్యం ఫలానా వారిని సీఈవో, సీవోవోగా నియమించనుంది… మీ ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా ఉండదు… ఎప్పటిలాగే పని చేయండని భరోసా ఇచ్చారు. అందరి సమ్మతంతోనే కొత్త బాస్‌ల నియామకం జరిపారు.

మరో వైపు టీవీ9లో ప్రస్తుతం సెక్యూరిటిగా పని చేస్తున్న ఏజెన్సీని మొత్తం తప్పించి కొత్త వారికి ఆ పగ్గాలు ఇచ్చారట. ఇదంతా గమనిస్తుంటే కొత్త యాజమాన్యం ఎంత పకడ్బందీగా తమ పని చేసుకొని పోతోందో అర్థమవుతోంది.

Tags:    
Advertisement

Similar News