ఐపీఎల్ -12లో నేడే అసలు సిసలు సమరం

క్వాలిఫైయర్స్ -2కు విశాఖలో కౌంట్ డౌన్  ఇటు చెన్నై సూపర్ కింగ్స్- అటు ఢిల్లీ క్యాపిటల్స్  ఫైనల్లో చోటుకు రెండుజట్లూ తహతహ దేశవిదేశాలలోని కోట్లాదిమంది అభిమానులను..గత ఏడువారాలుగా అలరిస్తూ వస్తున్న ఐపీఎల్ -12లో అసలు సిసలు సమరానికి.. స్టీల్ సిటీ విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే రెండో క్వాలిఫైయర్ సమరంలో…డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు…సంచలనాల ఢిల్లీ క్యాపిటల్స్ సవాల్ విసురుతోంది. చెన్నైకి ఫైనల్ చాన్స్… […]

Advertisement
Update:2019-05-10 04:09 IST
  • క్వాలిఫైయర్స్ -2కు విశాఖలో కౌంట్ డౌన్
  • ఇటు చెన్నై సూపర్ కింగ్స్- అటు ఢిల్లీ క్యాపిటల్స్
  • ఫైనల్లో చోటుకు రెండుజట్లూ తహతహ

దేశవిదేశాలలోని కోట్లాదిమంది అభిమానులను..గత ఏడువారాలుగా అలరిస్తూ వస్తున్న ఐపీఎల్ -12లో అసలు సిసలు సమరానికి.. స్టీల్ సిటీ విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది.

రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే రెండో క్వాలిఫైయర్ సమరంలో…డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు…సంచలనాల
ఢిల్లీ క్యాపిటల్స్ సవాల్ విసురుతోంది.

చెన్నైకి ఫైనల్ చాన్స్…

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా ఏడుసార్లు ఫైనల్స్ చేరి…మూడుసార్లు విజేతగా నిలిచిన చెన్నై రెండో క్వాలిఫైయర్స్ లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

హోంగ్రౌండ్ చెపాక్ స్టేడియంలో ముగిసిన తొలి క్వాలిఫైయర్ లో చిత్తుగా ఓడిన చెన్నైకి…రెండో క్వాలిఫైయర్ డూ ఆర్ డై గా మారింది.

లీగ్ టేబుల్ మొదటి రెండుస్థానాలలో నిలిచిన జట్టుగా…ఫైనల్స్ చేరటానికి రెండో అవకాశం దక్కించుకొన్న చెన్నై…ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.

నాలుగుసార్లు రన్నరప్ చెన్నై…

మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ కు మూడుసార్లు ఐపీఎల్ విన్నర్ గా నిలవటమే కాదు…నాలుగు సార్లు రన్నరప్ గా నిలిచిన అసాధారణ రికార్డు సైతం ఉంది. ఇప్పుడు ఎనిమిదోసారి ఫైనల్స్ చేరాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతోంది.

వాట్సన్, డూప్లెసీ, రాయుడు, ధోనీ, రైనా పూర్తిస్థాయిలో రాణించగలిగితేనే విజయావకాశాలు ఉంటాయి. ఇక.. బౌలింగ్ లో పేసర్ దీపక్ చాహర్, స్పిన్నర్లు ఇమ్రాన్ తాహీర్, రవీంద్ర జడేజా,హర్భజన్ సింగ్ కీలకం కానున్నారు.

దూకుడుమీదున్న ఢిల్లీ ….

మరోవైపు…శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్…దూకుడుమీదుంది.ఎలిమినేటర్ రౌండ్లో…సన్ రైజర్స్ పై సాధించిన విజయంతో.. కేరింతలు కొడుతోంది. తొలిసారి ఫైనల్స్ చేరాలన్న పట్టుదలతో పోటీకి సిద్ధమయ్యింది.

ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా, కెప్టెన్ అయ్యర్, సూపర్ హిట్టర్ రిషభ్ పంత్ ల పైనే ఢిల్లీ బ్యాటింగ్ పూర్తిగా ఆధారపడి ఉంది.
బౌలింగ్ లో పేస్ త్రయం ఇశాంత్ శర్మ, కీమో పాల్, ట్రెంట్ బౌల్ట్ తోపాటు వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ప్రధానపాత్ర పోషించబోతున్నారు.

విశాఖలో బ్యాటింగ్ పిచ్…

విశాఖ ఏసీఏ స్టేడియంలో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కు సైతం సమానంగా ఉపకరించే స్పోర్టివ్ పిచ్ ను సిద్ధం చేశారు. 180కి పైగా స్కోరు సాధించిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయి.

టాస్ నెగ్గిన జట్టు ..ముందుగా బ్యాటింగ్ కు దిగి భారీస్కోరుతో ఎదురుదాడికి దిగే వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉంది. శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈమ్యాచ్ టికెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.

మ్యాచ్ ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పోరులో విజేతగా నిలిచిన జట్టు..
హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా 12న జరిగే ఫైనల్లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది.

Tags:    
Advertisement

Similar News