జగన్ మౌనం.... చిర్రెత్తిపోతున్న టీడీపీ నాయకులు !

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సంధి కాలం నడుస్తోంది. ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసినా…. ఫలితాలు మే 23న రానున్నాయి. ఈ మధ్య చాలా రోజుల సమయం ఉంది. అయితే పోలింగ్ రోజు నాటి నుంచే వైసీపీ టార్గెట్‌గా టీడీపీ నాయకులు విరుచుకు పడుతున్నారు. అప్పుడప్పుడు వీటికి వైసీపీ నాయకులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. అయితే అధినేత జగన్ మౌనంగా ఉండటం టీడీపీ నాయకులకు చిర్రెత్తిస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు ఈవీఎంల పనితీరు, కూటమి ఏర్పాటు అంటూ […]

Advertisement
Update:2019-05-09 04:35 IST

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సంధి కాలం నడుస్తోంది. ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసినా…. ఫలితాలు మే 23న రానున్నాయి. ఈ మధ్య చాలా రోజుల సమయం ఉంది. అయితే పోలింగ్ రోజు నాటి నుంచే వైసీపీ టార్గెట్‌గా టీడీపీ నాయకులు విరుచుకు పడుతున్నారు. అప్పుడప్పుడు వీటికి వైసీపీ నాయకులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. అయితే అధినేత జగన్ మౌనంగా ఉండటం టీడీపీ నాయకులకు చిర్రెత్తిస్తోంది.

ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు ఈవీఎంల పనితీరు, కూటమి ఏర్పాటు అంటూ హడావిడి చేశారు. అంతే కాకుండా జగన్ లక్ష్యంగా ఎన్నో సార్లు విమర్శలు సంధించారు. మరోవైపు, కేబినెట్ మీటింగ్ పెడతా.. సమీక్షలు నిర్వహిస్తానంటూ…. ఈసీపై మండిపడుతున్నారు. ప్రతీ రోజు చంద్రబాబు తన అసహనాన్ని ఏదో విధంగా బయటపెడుతున్నారు. కానీ జగన్ మాత్రం మౌనాన్ని వీడట్లేదు.

పోలింగ్ ముగిసిన రోజు రాత్రి మాత్రం జగన్ మీడియా ముందుకు వచ్చి అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఇక అప్పటి నుంచి ఆయన ఎలాంటి రాజకీయ కామెంట్లు చేయలేదు. ఒకవైపు చంద్రబాబు సమీక్షలు అంటూ పార్టీ నాయకులతో భేటీ అవుతున్నా…. జగన్ మాత్రం తన సొంత పార్టీ వాళ్లను కూడా పెద్దగా కలవలేదు. అసలు ఇలా మౌనంగా ఎందుకు ఉంటున్నారని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, పలు సర్వేలు, విశ్లేషణలు తమ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. గెలుపుపై ధీమా ఉంది. ఈ సమయంలో అనవసరంగా అతి విశ్వాసంతో మాట్లాడటం మంచిది కాదని.. 2014 ఎదురైన చేదు అనుభవం తిరిగి పునరావృతం కాకూడదనే జగన్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News