కేసీఆర్ పై మోడీ సీరియస్.... కారణం ఇదేనట....
ప్రధాని నరేంద్రమోడీకి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మధ్య ఎన్నికల వేళ సంబంధాలు దెబ్బతిన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కేసీఆర్ పై ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. రెండు పనులే దానికి ప్రధాన కారణంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో కేసీఆర్ వైఖరిని ప్రశ్నిస్తూ కేసీఆర్ కు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంతకీ కేసీఆర్ పై కోపానికి గల కారణాలపై బీజేపీ […]
ప్రధాని నరేంద్రమోడీకి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మధ్య ఎన్నికల వేళ సంబంధాలు దెబ్బతిన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కేసీఆర్ పై ప్రధాని మోడీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. రెండు పనులే దానికి ప్రధాన కారణంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ విషయంలో కేసీఆర్ వైఖరిని ప్రశ్నిస్తూ కేసీఆర్ కు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంతకీ కేసీఆర్ పై కోపానికి గల కారణాలపై బీజేపీ వర్గాలు రెండు కారణాలు చెబుతున్నాయి.
మొదటగా వారణాసిలో తెలంగాణ పసుపు రైతుల నామినేషన్ల వెనుక కేసీఆర్ ప్రోద్బలం ఉందని మోడీ సీరియస్ అయినట్టు తెలిసింది. ఈ విషయంపైనే అమిత్ షా సైతం ఫోన్ చేసి ప్రశ్నించాడట. ఇక పార్టీ ఫండ్ గా ఎన్నికల ఖర్చు కోసం 8 కోట్ల రూపాలయలను బీజేపీ నాయకులు ఇండియన్ బ్యాంక్ పార్టీ ఖాతా నుంచి డ్రా చేసి తీసుకెళుతుండగా.. వాటిని తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకోవడం.. కేసీఆర్ స్పందించకపోవడంపై మోడీ, షాలు సీరియస్ గా ఉన్నట్టు సమాచారం.
ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ ప్రతిష్టను దెబ్బతీయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కుట్రలు చేసిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేసి కేసీఆర్ ను ప్రశ్నించినట్లు తెలిసింది.