కేసీఆర్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన ఎన్నికల సంఘం
కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో కేసీఆర్ ప్రభుత్వ అధికార గృహమైన ప్రగతిభవన్‌లో పార్టీ మీటింగులు నిర్వహించినట్లు ఆరోపణలు వచ్చాయి. పార్టీకి సంబంధించిన పలు సమావేశాలు నిర్వహించి కోడ్ ఉల్లంగించారని కాంగ్రెస్ నేత నిరంజన్ ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యి.. లోక్‌సభ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్‌తో కేసీఆర్ ప్రగతి భవన్‌లో […]
కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో కేసీఆర్ ప్రభుత్వ అధికార గృహమైన ప్రగతిభవన్‌లో పార్టీ మీటింగులు నిర్వహించినట్లు ఆరోపణలు వచ్చాయి. పార్టీకి సంబంధించిన పలు సమావేశాలు నిర్వహించి కోడ్ ఉల్లంగించారని కాంగ్రెస్ నేత నిరంజన్ ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశారు.
అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యి.. లోక్‌సభ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్‌తో కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారని ఆ పిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ పిర్యాదుపై దర్యాప్తు చేయాలని సీఈవో రజత్ కుమార్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఈ పిర్యాదును స్థానిక రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు దర్యాప్తు చేశారు. ఆ నివేదిక ప్రకారం కేసీఆర్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడలేదని తెలిసింది. ఈ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ కార్యదర్శి ఏకే రుడోలాకు పంపడంతో.. సీఈసీ సీఎం కేసీఆర్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ విషయాన్ని తెలంగాణ సీఈవో రజత్ కుమార్ తెలియజేశారు.