మాకే ఓటు వేయండి... లేకపోతే... నేతల బెదిరింపులు..!

ఒకప్పుడు ఎన్నికల ప్రచారం హుందాగా సాగేది. అవసరమైతే తప్ప ప్రత్యర్థులను విమర్శించే వారు కాదు. తామేం చేస్తామో చెప్పుకుంటూనే ఓట్లు అడిగేవారు. ఎదుటి పార్టీని, నేతలను విమర్శించాల్సి వచ్చినా తమ గౌరవానికి భంగం లేకుండా చూసుకునే వారు. గిరిగీసినట్టుగా రాజకీయాలున్న ప్రాంతాలలో తప్ప, మిగతా చోట్ల ఎన్నికల ప్రచారం ఓ పద్ధతిగా సాగేది. కాలం మారింది. నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. రాజకీయ నాయకులు తమ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రత్యర్థుల మీద విరుచుకుపడుతున్నారని […]

Advertisement
Update:2019-05-07 02:16 IST

ఒకప్పుడు ఎన్నికల ప్రచారం హుందాగా సాగేది. అవసరమైతే తప్ప ప్రత్యర్థులను విమర్శించే వారు కాదు. తామేం చేస్తామో చెప్పుకుంటూనే ఓట్లు అడిగేవారు. ఎదుటి పార్టీని, నేతలను విమర్శించాల్సి వచ్చినా తమ గౌరవానికి భంగం లేకుండా చూసుకునే వారు. గిరిగీసినట్టుగా రాజకీయాలున్న ప్రాంతాలలో తప్ప, మిగతా చోట్ల ఎన్నికల ప్రచారం ఓ పద్ధతిగా సాగేది. కాలం మారింది. నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

రాజకీయ నాయకులు తమ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రత్యర్థుల మీద విరుచుకుపడుతున్నారని అంటున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏం మాట్లాడారో గుర్తు చేస్తున్నారు. సర్కారు నుంచి అందించే సంక్షేమ పథకాలకు ప్రతి పైసా ప్రభుత్వ ఖజానా నుంచే ఖర్చు పెడతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు.

కానీ, చంద్రబాబు మాత్రం ‘నేను వేసిన రోడ్ల మీద నడుస్తూ వేరేవాళ్లకు ఓట్లు ఎలా వేస్తారు…’ అంటూ ప్రజలను ప్రశ్నించారు. ‘నేనే అన్నదాతలకు రైతుబంధు పథకం కింద డబ్బులు ఇచ్చాను. మహిళలకు పసుపు కుంకుమ కింద ఆర్థిక సాయం చేశాను’ అంటూ మాట్లాడారని గుర్తు చేస్తున్నారు. మరి ఇవేమన్నా బాబు తన జేబు నుంచి ఇచ్చారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణలో కూడా పలువురు నేతలు ఇలాగే మాట్లాడుతున్నారు. ఒక మంత్రి… జిల్లాలో పరిషత్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ “మీరు తప్పనిసరిగా అధికార పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలి..వారు మాత్రమే అభివృద్ధి పనులకు నిధులు తేగలుగుతారు. విపక్షాలకు వేస్తే నిధులు రావు” అని వ్యాఖ్యానించారు.

సాంస్కృతిక సారథి అధ్యక్షుడు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న రసమయి బాలకిషన్ మరో అడుగు ముందుకు వేశారు. “మీరు టీఆర్ఎస్ కే ఓటు వేయండి. ఎందుకంటే షాదీ ముబాకర్, కల్యాణలక్ష్మి పథకాలకు సంబంధించిన కాగితాల మీద సంతకాలు పెట్టాల్సింది నేనేనని గుర్తుంచుకోండి” అంటూ ఓటర్లను
హెచ్చరించారు.

ఇంకా చాలా మంది అధికార పార్టీకి చెందిన నాయకులు ఇలాగే మాట్లాడుతున్న విషయాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. నాయకులు ఇలా ఎలా పడితే అలా మాట్లాడుతున్నా ఎన్నికల సంఘం ఏ మాత్రం పట్టించుకోకపోవడం శోచనీయమని పేర్కొంటున్నారు.

Tags:    
Advertisement

Similar News