కేటీఆర్ దెబ్బకు బెంబేలెత్తుతున్న మంత్రులు ....!

ఆయన ఇప్పుడు మంత్రి కాదు.. కేవలం ఎమ్మెల్యే.. అయినా తెలంగాణ ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు.. ఆయనకు అధికారాలు లేకున్నా అధికారానికి కేంద్రంగా మారారు. ఏకంగా మంత్రులనే నియంత్రిస్తున్నాడు. ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఆయన దెబ్బకు పదవులు నిర్వహిస్తున్న మంత్రులు కూడా నామమాత్రంగా మారిపోయారు.  తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు ప్రభుత్వం ఏ పదవీ లేదు.. అయినా ఇప్పుడు తండ్రి చాటు గా అధికారాన్ని వ్యవస్థలను నియంత్రిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో మంత్రులంతా డమ్మీగా మారిపోవడం, వారి […]

Advertisement
Update:2019-05-06 10:40 IST

ఆయన ఇప్పుడు మంత్రి కాదు.. కేవలం ఎమ్మెల్యే.. అయినా తెలంగాణ ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు.. ఆయనకు అధికారాలు లేకున్నా అధికారానికి కేంద్రంగా మారారు. ఏకంగా మంత్రులనే నియంత్రిస్తున్నాడు. ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఆయన దెబ్బకు పదవులు నిర్వహిస్తున్న మంత్రులు కూడా నామమాత్రంగా మారిపోయారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు ప్రభుత్వం ఏ పదవీ లేదు.. అయినా ఇప్పుడు తండ్రి చాటు గా అధికారాన్ని వ్యవస్థలను నియంత్రిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో మంత్రులంతా డమ్మీగా మారిపోవడం, వారి ఆవేదనపై కథలుకథలుగా కథనాలు రావడంతో అంతా ఉసూరుమంటున్నారు.

కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. కేటీఆర్ సమాజంలో జరుగుతున్న సమస్యలపై వేగంగా స్పందిస్తున్నారు. అసహాయులు ట్విట్టర్ లో సాయం కావాలని కోరగానే తెలంగాణ మంత్రులను, అధికారులను, పోలీసులను ఆదేశిస్తూ కేటీఆర్ ముందుకెళ్తున్నారు.

కేటీఆర్ కు ఇప్పుడు ఏ శాఖ లేదు.. అన్ని శాఖలు ఆయనవైపే.. అన్నింటిలోనూ వేలు పెడుతున్నాడు. అన్ని సమస్యలను మంత్రులకు తెలియకుండానే చేసేస్తున్నాడు. కేటీఆర్ చెప్పడం.. అధికారులు చేయడంతో మంత్రులంతా డమ్మీ అయిపోయారు. దీంతో వారి ఆవేదన కక్కలేక మింగలేక ఉందట..కానీ బాధితుల సమస్యలు మాత్రం పరిష్కారం అవుతుండడం విశేషం.

Tags:    
Advertisement

Similar News