మిస్సెస్ ఇండియా పోటీలు.... విజయవాడ తొలి మహిళగా నిలిచిన భావన
మిస్సెస్ ఇండియా కాంటెస్ట్ లో విజయవాడ కు చెందిన భావన మూడవ ఫ్లేస్ లో నిలిచింది. పెళ్లయిన మహిళలకు నిర్వహించిన ఈ పోటీల్లో పాల్గొన్న 27 ఏళ్ళ భావన విజయవాడ కు చెందిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. అందం, ఆత్మవిశ్వాసం, తెలివితేటలు, రాంప్ వాక్ లలో బెజవాడ మహిళలు ఏమాత్రం తీసిపోరని భావన నిరూపించింది. తెలంగాణ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 111 మంది మహిళలో భావన మూడవ ఫ్లేస్ లో నిలిచింది…. కిరీటాన్ని […]
మిస్సెస్ ఇండియా కాంటెస్ట్ లో విజయవాడ కు చెందిన భావన మూడవ ఫ్లేస్ లో నిలిచింది. పెళ్లయిన మహిళలకు నిర్వహించిన ఈ పోటీల్లో పాల్గొన్న 27 ఏళ్ళ భావన విజయవాడ కు చెందిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది.
అందం, ఆత్మవిశ్వాసం, తెలివితేటలు, రాంప్ వాక్ లలో బెజవాడ మహిళలు ఏమాత్రం తీసిపోరని భావన నిరూపించింది. తెలంగాణ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 111 మంది మహిళలో భావన మూడవ ఫ్లేస్ లో నిలిచింది…. కిరీటాన్ని కైవసం చేసుకుంది.
బుధవారం అర్ధరాత్రి వరకు ఈ పోటీలు జరిగాయి…. విజయవాడ కు చెందిన భావన కూచిపూడి నాట్యం లో పట్టభద్రురాలు. గౌరవ డాక్టరేట్ తో పాటు 22 స్టేట్ , నేషనల్ అవార్డులను పొందింది. అంతే కాకుండా బాహుబలి లోని శాస్త్రీయ నృత్యాలకు కోరియోగ్రఫీ చేశారు.. 10 ఏళ్ళు టీవీ రిపోర్టర్ గా భావన పనిచేసింది.