ఐపీఎల్ -12 డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో ఆఖరి రౌండ్

ఫిరోజ్ షా కోట్లాలో ఢిల్లీకి రాజస్థాన్ సవాల్ బెంగళూరుతో హైదరాబాద్ ఢీ ఐపీఎల్ 2019వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో…54 మ్యాచ్ ల తొలి ఘట్టం ముగింపు దశకు చేరింది. న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా శనివారం జరిగే తొలి పోరులో ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్ తో మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. రాత్రి 8 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే రెండో మ్యాచ్ లో రాయల్ […]

Advertisement
Update:2019-05-04 00:32 IST
  • ఫిరోజ్ షా కోట్లాలో ఢిల్లీకి రాజస్థాన్ సవాల్
  • బెంగళూరుతో హైదరాబాద్ ఢీ

ఐపీఎల్ 2019వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో…54 మ్యాచ్ ల తొలి ఘట్టం ముగింపు దశకు చేరింది. న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా శనివారం జరిగే తొలి పోరులో ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్ తో మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనుంది.

రాత్రి 8 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే రెండో మ్యాచ్ లో రాయల్ చాలెంజ్ బెంగళూరుతో హైదరాబాద్ సన్ రైజర్స్ ఢీ కొననుంది. ఈ రెండుమ్యాచ్ లూ… మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ కు అత్యంత కీలకం కానున్నాయి.

కోట్లా స్టేడియం వేదికగా సాయంత్రం 4 గంటలకు జరిగే పోటీలో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఢిల్లీ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ రౌండ్లో చోటు ఖాయం చేసుకోడంతో…. ఆఖరి రౌండ్ మ్యాచ్ కు అంతగా ప్రాధాన్యం లేకపోయినా…. రాజస్థాన్ రాయల్స్ కు మాత్రం…. చావో బతుకో సమరంలా మారింది.

ఆరునూరైనా ఈమ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ నెగ్గి తీరాల్సి ఉంది. ఢిల్లీ జట్టు 13 రౌండ్లలో 8 విజయాలు, 5 పరాజయాల రికార్డుతో 16 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ మూడోస్థానంలో కొనసాగుతోంది. 14వ రౌండ్లో రాజస్థాన్ పై నెగ్గితే… మొదటి రెండుజట్లలో ఒకటిగా నిలువగలుగుతుంది.

మరోవైపు…రాజస్థాన్ రాయల్స్ మాత్రం 13 రౌండ్లలో 5 విజయాలు, 7 పరాజయాల రికార్డుతో 11 పాయింట్లతో ఐదోస్థానంలో కొట్టిమిట్టాడుతోంది.

ఇటు బెంగళూరు- అటు హైదరాబాద్….

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే రెండో మ్యాచ్ లో …విజయమే లక్ష్యంగా హైదరాబాద్ సన్ రైజర్స్ పోటీకి దిగుతోంది. ఆతిథ్య బెంగళూరు ఇప్పటి వరకూ ఆడిన 13 రౌండ్లలో 4 విజయాలు, 8 పరాజయాలతో ఇప్పటికే ప్లేఆఫ్ రౌండ్ కు దూరమయ్యింది.

హైదరాబాద్ సన్ రైజర్స్ మాత్రం 13 రౌండ్లలో 6 విజయాలు, 7 పరాజయాలతో 12 పాయింట్లు సాధించడం ద్వారా నాలుగోస్థానంలో కొనసాగుతోంది. ఆఖరిరౌండ్లో బెంగళూరును ఓడించగలిగితే… సన్ రైజర్స్ నాలుగో జట్టుగా ప్లే ఆఫ్ రౌండ్ చేరుకోగలుగుతుంది.

Tags:    
Advertisement

Similar News