కొత్తిమీర.... ఖర్చు తక్కువ.... ఆరోగ్యం ఎక్కువ....

భారతీయ సంప్రదాయ వంటలలో కొత్తిమీరకి ప్రత్యేక స్దానం ఉంది. దాదాపు అన్ని వంటలలోనూ కొత్తిమీర వాడతారు. ఆహారంలో కొత్తిమీర తగలగానే అది మంచి రుచిని సంతరించుకుంటుంది. ఆహారానికి రుచిని పెంచాలంటే కొత్తిమీరే ఫినిషింగ్ టచ్ అన్న మాట. మరి ఇన్ని తెలుసుకున్న మనకు కొత్తిమీరలో ఉన్న ప్రయోజనాల గురించి కూడా తెలియాలి కదా… కొత్తిమీర శరీరంలో ఉన్న ఇన్సులిన్ ను పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి. ఇది రక్తంలో ఉన్న షుగర్ లెవెల్స్ ను అదుపు చేస్తుంది. […]

Advertisement
Update:2019-05-04 03:06 IST

భారతీయ సంప్రదాయ వంటలలో కొత్తిమీరకి ప్రత్యేక స్దానం ఉంది. దాదాపు అన్ని వంటలలోనూ కొత్తిమీర వాడతారు. ఆహారంలో కొత్తిమీర తగలగానే అది మంచి రుచిని సంతరించుకుంటుంది. ఆహారానికి రుచిని పెంచాలంటే కొత్తిమీరే ఫినిషింగ్ టచ్ అన్న మాట. మరి ఇన్ని తెలుసుకున్న మనకు కొత్తిమీరలో ఉన్న ప్రయోజనాల గురించి కూడా తెలియాలి కదా…

  • కొత్తిమీర శరీరంలో ఉన్న ఇన్సులిన్ ను పెంచే గుణాలు అధికంగా ఉన్నాయి. ఇది రక్తంలో ఉన్న షుగర్ లెవెల్స్ ను అదుపు చేస్తుంది.
  • కొత్తిమీరలో ఉన్న ఐరన్ కంటెంట్ రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ది చేసే గుణాలు కొత్తిమీరలో అధికంగా ఉన్నాయి.
  • కొత్తిమీర కషాయం పుక్కిలిస్తే నోటి పూత, పంటి నొప్పి, ఇతర దంత సమస్యలు దూరమవుతాయి.
  • కొత్తిమీర ఆకును కొద్దిగా వేడి చేసి దానిని కళ్లకు కడితే కంటి నుంచి నీరు కారడం, కండ్లకలకతో పాటు ఇతర కంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
  • ఆకలి మందగిస్తే కొద్దిగా కొత్తిమీర పంచదారతో కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
  • మూత్రాశ్రయ వ్యాధులకు కొత్తిమీర మంచి ఔషధం. మూత్ర పిండాలలోని రాళ్లను కరిగించే గుణాలు కొత్తిమీరలో ఉన్నాయి.
  • కొత్తిమీర శారీరక, మానసిక అలసటను తొలగిస్తుంది.
  • మొటిమలు, నల్లటి మచ్చలకు కొత్తిమీర, పసుపు కలిపిన ముద్దను రాస్తే అవి క్రమేపి కనుమరుగవుతాయి.
  • కొత్తిమీరలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోకి చెడు కొలెస్ట్రాల్ ను చేరనివ్వదు. ఇందులోని ఫైబర్ శరీరంలో ఉన్న వ్యర్దాలను బయటకి పంపడంలో సహాయపడుతుంది.

ఇంకా కొత్తిమీరలో పొటాషియం, ప్రొటీన్స్, విటమిన్ సి, విటమిన్ బి, నియాసిన్, క్యాల్షియం, పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరంలో ఉన్న ప్రతి అవయానికీ మేలు చేస్తాయి.

Tags:    
Advertisement

Similar News