ఐపీఎల్ రౌండ్ రాబిన్ లీగ్ లో చెన్నై టాప్

 చెన్నై స్పిన్ జాదూలో ఢిల్లీ క్యాపిటల్స్ గల్లంతు 13 రౌండ్లలో 9 విజయాలు , 18 పాయింట్లు ఐపీఎల్ 12వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో… డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ దూకుడు కొనసాగుతోంది. 13వ రౌండ్ పోటీలు ముగిసే సమయానికి..9 విజయాలు, 18 పాయింట్లతో లీగ్ టేబుల్ టాపర్ స్థానంలో నిలిచింది. హోంగ్రౌండ్ చెపాక్ స్టేడియం వేదికగా ముగిసిన 13వ రౌండ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను 80 పరుగుల తేడాతో […]

Advertisement
Update:2019-05-02 09:15 IST
  • చెన్నై స్పిన్ జాదూలో ఢిల్లీ క్యాపిటల్స్ గల్లంతు
  • 13 రౌండ్లలో 9 విజయాలు , 18 పాయింట్లు

ఐపీఎల్ 12వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో… డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ దూకుడు కొనసాగుతోంది. 13వ రౌండ్ పోటీలు ముగిసే సమయానికి..9 విజయాలు, 18 పాయింట్లతో లీగ్ టేబుల్ టాపర్ స్థానంలో నిలిచింది.

హోంగ్రౌండ్ చెపాక్ స్టేడియం వేదికగా ముగిసిన 13వ రౌండ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను 80 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఎనిమిదిజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో అగ్రస్థానం ఎవరిదో తేల్చుకోడానికి జరిగిన ఈమ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న ఢిల్లీ క్యాపిటల్స్ ప్రత్యర్థి చెన్నైని తక్కువ స్కోరుకు పరిమితం చేయడంలో విఫలమయింది.

ఓపెనర్ డూప్లెసీ 39, వన్ డౌన్ సురేష్ రైనా 59, కెప్టెన్ ధోనీ 44, రవీంద్ర జడేజా 25 పరుగులు సాధించడంతో 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగుల భారీ స్కోరు సాధించింది.

సమాధానంగా ..180 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్…16.2 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది.

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక్కడే 44 పరుగుల స్కోరుతో ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడినా ఘోర పరాజయం తప్పలేదు. చెన్నై లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ 12 పరుగులిచ్చి 4 వికెట్లు, లెఫ్టామ్ స్పిన్నర్ జడేజా 9 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు.

ప్రస్తుత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఇదే అతిపెద్ద ఓటమి కావడం విశేషం. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Tags:    
Advertisement

Similar News