భారత వెయిట్ లిఫ్టింగ్ గోల్డెన్ బోయ్!

ఒక్క టోర్నీలో 15 రికార్డులు మిజోరం డైనమైట్ జెర్మీ లాల్ రినుంగా ప్రపంచ, ఆసియా యువజన వెయిట్ లిఫ్టింగ్ లో భారత కుర్రాడు జెర్మీ లాల్ రినుంగా పేరు మార్మోగిపోతోంది. ఖేలో ఇండియా పథకం ద్వారా జాతీయ వెయిట్ లిఫ్టింగ్ లోకి దూసుకొచ్చిన 16 ఏళ్ల ఈ మిజోరం డైనమైట్ రికార్డుల మోతతో పతకాల వేట కొనసాగిస్తున్నాడు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్ లో ఎన్నో రాష్ట్రాలు…ఎన్నెన్నో క్రీడలు. అయితే…క్రీడాపరంగా చూస్తే మహారాష్ట్ర, పంజాబ్, కేరళ రాష్ట్రాలకు […]

Advertisement
Update:2019-04-30 06:55 IST
  • ఒక్క టోర్నీలో 15 రికార్డులు
  • మిజోరం డైనమైట్ జెర్మీ లాల్ రినుంగా

ప్రపంచ, ఆసియా యువజన వెయిట్ లిఫ్టింగ్ లో భారత కుర్రాడు జెర్మీ లాల్ రినుంగా పేరు మార్మోగిపోతోంది. ఖేలో ఇండియా పథకం ద్వారా జాతీయ వెయిట్ లిఫ్టింగ్ లోకి దూసుకొచ్చిన 16 ఏళ్ల ఈ మిజోరం డైనమైట్ రికార్డుల మోతతో పతకాల వేట కొనసాగిస్తున్నాడు.

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్ లో ఎన్నో రాష్ట్రాలు…ఎన్నెన్నో క్రీడలు. అయితే…క్రీడాపరంగా చూస్తే మహారాష్ట్ర, పంజాబ్, కేరళ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారుల పేర్లు మాత్రమే మనకు తరచూ వినిపిస్తుంటాయి.

ఈశాన్య రాష్ట్రాలలో మణిపూర్, అసోం రాష్ట్రాల పేర్లు మాత్రమే క్రీడాభిమానులకు తెలుసు.

ప్రస్తుతం మాత్రం ఆ పరిస్థితి మారింది. సరిహద్దు రాష్ట్రం మిజోరం పేరు సైతం తొలిసారిగా వినిపిస్తోంది. మిజోల గడ్డ మీద నుంచి రెండేళ్ల క్రితమే బుల్లెట్ లాంటి 15 ఏళ్ల కుర్రాడు దూసుకొచ్చాడు. బరువులెత్తే క్రీడ వెయిట్ లిఫ్టింగ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు.

ఖేలో ఇండియాతో వెలుగులోకి……

ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఖేలో ఇండియా పథకం ద్వారా వెలుగులోకి వచ్చిన మొనగాడే జెర్మీ లాల్ రినుంగా. ఆసియా యువజన వెయిట్ లిఫ్టింగ్ తో పాటు అర్జెంటీనాలోని బ్యునోస్ ఏర్స్ వేదికగా ముగిసిన ప్రపంచ యువజన ఒలింపిక్స్ 62 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించాడు.

కేవలం 15 ఏళ్ల వయసులోనే యువజన ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన భారత తొలి క్రీడాకారుడిగా రికార్డుల్లో చేరాడు. మారుమూల మిజోరం రాష్ట్రానికి మాత్రమే కాదు… భారత్ కు సైతం అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకువచ్చాడు.

క్రీడాపరంగా ఏమాత్రం గుర్తింపు లేని మిజోరం పేరు ఇప్పుడు… జెర్మీ ప్రతిభతో ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది.

జెర్మీ రికార్డుల మోత…

జపాన్ లోని రింగ్బో వేదికగా జరిగిన 2019 ఆసియా వెయిట్ లిఫ్టింగ్ పోటీల 67 కిలోలవిభాగంలో 16 ఏళ్ల జెర్మీ తొలిసారిగా బరిలోకి దిగాడు. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ విభాగాలలో ఏకంగా 297 కిలోల బరువు ఎత్తడం ద్వారా..ఏకకాలంలో ప్రపంచ యూత్, జాతీయ సీనియర్ రికార్డులను తెరమరుగు చేసి సరికొత్త రికార్డులు నెలకొల్పాడు.

స్నాచ్ లో 134 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ లో 163 కిలోల బరువెత్తి వారెవ్వా అనిపించుకొన్నాడు. జెర్మీ ఏకంగా 15 రికార్డులు సాధించాడు. 16 ఏళ్ల వయసులో 15 సరికొత్త రికార్డులు నెలకొల్పిన భారత తొలి లిఫ్టర్ గా జెర్మీ చరిత్ర సృష్టించాడు.

గ్రూప్- బీ విభాగంలో తన కంటే అపార అనుభవం ఉన్న పాకిస్థాన్ కు చెందిన సీనియర్ లిఫ్టర్ తాలా తాలీబ్ తర్వాతి స్థానంలో నిలిచాడు.

ఆసియా సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో తొలిసారిగా పాల్గొన్న జెర్మీ వయసుకు మించిన ప్రతిభ కనబరచడంతో పాటు… స్నాచ్ విభాగంలో 134 కిలోల బరువు ఎత్తడం ద్వారా మూడు ప్రపంచ యువజన, తొమ్మిది అంతర్జాతీయ, మూడు జాతీయ, మూడు జాతీయ సీనియర్ నేషనల్ రికార్డులు నెలకొల్పాడు.

కజకిస్తాన్ లిఫ్టర్ సైకాన్ తైసుయేవ్ పేరుతో ఉన్న 161 కిలోల స్నాచ్ ప్రపంచ రికార్డును జెర్మీ 163 కిలోల రికార్డుతో అధిగమించాడు.

67 కిలోల విభాగంలో కేవలం రెండు అంతర్జాతీయ టోర్నీలలో మాత్రమే పాల్గొన్న జెర్మీ లాల్ రినుంగా… పిట్టకొంచెం కూతఘనం అనిపించుకొన్నాడు. టోక్యో ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొనే భారతజట్టు లో యువకెరటం జెర్మీ కి చోటు దక్కాలని కోరుకొందాం.

ఇదీ…జెర్మీ విజయాల చిట్టా…..

  • 2016 ఆసియా యువజన వెయిట్ లిఫ్టింగ్ లో రజతం
  • 2016 ప్రపంచ యువజన వెయిట్ లిఫ్టింగ్ లో రజతం
  • 2017 కామన్వెల్త్ జూనియర్ విభాగంలో స్వర్ణం
  • 2017 కామన్వెల్త్ యువజన విభాగంలో స్వర్ణం
  • 2017 ప్రపంచ యువజన విభాగంలో రజతం
  • 2018 ఆసియా యువజన విభాగంలో రజతం
  • 2018 ఆసియా జూనియర్ విభాగంలో కాంస్యం
  • ఆసియా వెయిట్ లిఫ్టింగ్ లో 15 రికార్డుల జెర్మీ
  • 16 ఏళ్ల చిరుప్రాయంలోనే జెర్మీ రికార్డుల మోత
Tags:    
Advertisement

Similar News