ఐపీఎల్ ప్రకటనలతో స్టార్ ఇండియాకు డబ్బే డబ్బు
2019 సీజన్లోనే 2100 కోట్ల ఆదాయం 16 వేల 347 కోట్ల కు దక్కించుకొన్న ప్రసారహక్కులు దేశవ్యాప్తంగా 11 వేదికల్లో జరుగుతున్న ఐపీఎల్ 12వసీజన్ పోటీల ప్రచార ప్రకటనలతో…స్టార్ ఇండియా పండుగ చేసుకొంటోంది. కళ్లు చెదిరే మొత్తాలలో ఆదాయం ఆర్జిస్తోంది. ఐపీఎల్ గ్లోబల్ ప్రసార హక్కులను 16వేల 347 కోట్ల రూపాయల మొత్తానికి సొంతం చేసుకొన్న స్టార్ నెట్ వర్క్ …పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొంటోంది. గతంలో అధికారక బ్రాడ్ కాస్టర్ గా ఉన్న సోనీ నెట్ వర్క్ 10వేల […]
- 2019 సీజన్లోనే 2100 కోట్ల ఆదాయం
- 16 వేల 347 కోట్ల కు దక్కించుకొన్న ప్రసారహక్కులు
దేశవ్యాప్తంగా 11 వేదికల్లో జరుగుతున్న ఐపీఎల్ 12వసీజన్ పోటీల ప్రచార ప్రకటనలతో…స్టార్ ఇండియా పండుగ చేసుకొంటోంది. కళ్లు చెదిరే మొత్తాలలో ఆదాయం ఆర్జిస్తోంది. ఐపీఎల్ గ్లోబల్ ప్రసార హక్కులను 16వేల 347 కోట్ల రూపాయల మొత్తానికి సొంతం చేసుకొన్న స్టార్ నెట్ వర్క్ …పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొంటోంది.
గతంలో అధికారక బ్రాడ్ కాస్టర్ గా ఉన్న సోనీ నెట్ వర్క్ 10వేల కోట్ల రూపాయల మొత్తానికే పదేళ్ల ప్రసార హక్కులు సంపాదించినా.. పూర్తిస్థాయిలో సొమ్ము చేసుకోలేకపోయింది.
అయితే ..సోనీ నెట్ వర్క్ కంటే రెట్టింపు మొత్తంతో ప్రసార హక్కులు సాధించిన స్టార్ ఇండియా..వినూత్న వ్యూహాలతో ప్రకటనల ఆదాయం రెండుచేతులా ఆర్జిస్తోంది.
ప్రకటనల ఆదాయం 2100 కోట్ల రూపాయలు..
2019 ఐపీఎల్ సీజన్ ప్రకటనల ద్వారా స్టార్ ఇండియా 2100 కోట్ల రూపాయలు ఆర్జించింది. 2008 ఐపీఎల్ సీజన్ లో కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే ప్రకటనల ఆదాయంగా ఉంటే..2019నాటికి అదికాస్త ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది.
టెలివిజన్, డిజిటిల్ ప్రకటనలను వేర్వేరు విభాగాలుగా విక్రయించడం ద్వారా మరింత ఆదాయం ఆర్జించింది. సహసమర్పణ స్పాన్సర్ షిప్ కింద 100 కోట్ల రూపాయలు, అసోసియేట్ స్పాన్సర్ల నుంచి 70 కోట్ల రూపాయలు, డిజిటల్ మీడియా ద్వారా 25 కోట్ల రూపాయలు ఆర్జించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
డిజిటల్ మీడియా హక్కులు పొందిన సంస్థల్లో కోకాకోలా, అమెజాన్, డ్రీమ్ 11, స్విగ్గీలు సహసమర్పకులుగా ఉన్నాయి. టీవీ ప్రకటనల్లో ఒప్పో, ఫోన్ పే, వీవో, థమ్స్ అప్ ప్రధాన స్పాన్సర్లుగా ఉన్నాయి.
ఏషియన్ పెయింట్స్, స్విగ్గీ, మారుతీ సుజుకీ, బిగ్ బజార్, డైరీ మిల్క్, విమల్, డ్రీమ్ 11, మేక్ మై ట్రిప్, వోల్టాస్, ఎమ్మారెఫ్, బైజూస్, పాలీ క్యాబ్, మొబైల్ ప్రీమియర్ లీగ్, శామ్ సంగ్ సంస్థలు అసోసియేట్ స్పాన్సర్లుగా ఒప్పందాలు కుదుర్చుకొన్నాయి.
పదేళ్ల కాలానికి 16వేల 347 రూపాయల మొత్తం చెల్లిస్తున్న స్టార్ ఇండియా…ఏడాదికి సగటున రెండువేల కోట్ల చొప్పున…మొత్తం పదేళ్ల కాలంలో 20వేల కోట్ల రూపాయలకు పైగా ఆర్జించే అవకాశాలు ఉన్నాయి.
ఐపీఎల్ పుణ్యమా అంటూ ఇటు బీసీసీఐ..అటూ స్టార్ ఇండియా కాసుల పంట పండించుకోగలుగుతున్నాయి. ఇదంతా గ్లోబలైజేషన్ మహిమే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.