ప్రవర్తనా నియమావళి ఇప్పుడు గుర్తొచ్చిందా?

గురివింద తన కింద నలుపెరుగదంటారు…. అలా ఉంది చంద్రబాబు వ్యవహార శైలి. ఎన్నికల కమిషన్‌…. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని చీఫ్‌ సెక్రటరీగా నియమించగానే…. తానో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయం కూడా మరిచిపోయిన చంద్రబాబు ఆవేశంలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఎల్వీ సుబ్రహ్మణ్యం సహనిందితుడని, కోవర్టు అని నోరు పారేసుకున్నాడు. అంతటితో ఆగకుండా ప్రతిరోజూ తాను అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. తనవారిచేత చీఫ్‌ సెక్రటరీని అడ్డమైన మాటలతో తిట్టిస్తున్నాడు. చివరికి ఎంతగా దిగజారారంటే […]

Advertisement
Update:2019-04-27 09:35 IST

గురివింద తన కింద నలుపెరుగదంటారు…. అలా ఉంది చంద్రబాబు వ్యవహార శైలి.

ఎన్నికల కమిషన్‌…. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని చీఫ్‌ సెక్రటరీగా నియమించగానే…. తానో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయం కూడా మరిచిపోయిన చంద్రబాబు ఆవేశంలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఎల్వీ సుబ్రహ్మణ్యం సహనిందితుడని, కోవర్టు అని నోరు పారేసుకున్నాడు.

అంతటితో ఆగకుండా ప్రతిరోజూ తాను అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. తనవారిచేత చీఫ్‌ సెక్రటరీని అడ్డమైన మాటలతో తిట్టిస్తున్నాడు. చివరికి ఎంతగా దిగజారారంటే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చీఫ్‌ సెక్రటరీని బెదిరిస్తూ మే 23 తరువాత సీఎస్‌ సంగతి చూస్తాం…. అని హెచ్చరించాడు.

ఇక చిల్లర మల్లర నాయకులు అయితే వాళ్ళ నోళ్ళకు అడ్డూ అదుపే లేదు. వీటన్నింటికీ పరాకాష్ట్రగా నిన్న చంద్రబాబు చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఒక లేఖ రాసి దానిపై వివరణ ఇవ్వాలని కూడా కోరాడు. అఖిల భారత సర్వీస్‌ అధికారుల ప్రవర్తనా నియమావళిని కూడా ఉల్లంఘించి మీరు ప్రవర్తిస్తున్నారు…. మీ ప్రవర్తన హుందాగా, గౌరవంగా లేదు…. ఒక ముఖ్యమంత్రినైన నా పట్ల మీరు వాడిన భాష అభ్యంతరకరంగా ఉంది…. అంటూ వివరణ ఇవ్వాలని కోరాడు.

ఇంతకూ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎమన్నారంటే ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి….. ముఖ్యమంత్రికి ఉన్న అధికారాలు ఉండవు అని. ఇందులో అభ్యంతరకర భాష ఏమిటో ఆయనకే తెలియాలి. ఒక ప్రభుత్వ ప్రధానకార్యదర్శి పట్ల చంద్రబాబు వాడిన భాషే అభ్యంతరకరంగా ఉంది తప్ప…. ప్రధానకార్యదర్శి ఎప్పుడూ నోరు జారినట్టు కనిపించదు. తిట్టేది వీళ్ళే…. వివరణ కోరేదీ వీళ్ళే…!

Tags:    
Advertisement

Similar News