ఐపీఎల్ లో బెంగళూరు విజయాల హ్యాట్రిక్
కింగ్స్ పంజాబ్ పై 17 పరుగులతో సంచలన విజయం లీగ్ టేబుల్ 7వ స్థానంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఏబీ డివిలియర్స్ ధూమ్ ధామ్ బ్యాటింగ్ ఐపీఎల్ 12వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో…మాజీ రన్నరప్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మరో కీలక విజయం సాధించింది. హోంగ్రౌండ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన 11వ రౌండ్ పోటీలో కింగ్స్ పంజాబ్ ను 17 పరుగులతో రాయల్ చాలెంజర్స్ అధిగమించింది. ఈ కీలక మ్యాచ్ లో… […]
- కింగ్స్ పంజాబ్ పై 17 పరుగులతో సంచలన విజయం
- లీగ్ టేబుల్ 7వ స్థానంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్
- ఏబీ డివిలియర్స్ ధూమ్ ధామ్ బ్యాటింగ్
ఐపీఎల్ 12వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో…మాజీ రన్నరప్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మరో కీలక విజయం సాధించింది. హోంగ్రౌండ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన 11వ రౌండ్ పోటీలో కింగ్స్ పంజాబ్ ను 17 పరుగులతో రాయల్ చాలెంజర్స్ అధిగమించింది.
ఓపెనర్ పార్థివ్ పటేల్ 43, ఏబీ డివిలియర్స్ 83 పరుగుల నాటౌట్ స్కోర్లు సాధించడంతో…బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగుల స్కోరు సాధించింది.
ఆఖరి 12 బాల్స్ లో బెంగళూరు 48 పరుగులు సాధించడం ఓ రికార్డుగా మిగిలిపోతుంది.
డివిలియర్స్ మెరుపులు…
డివిలియర్స్ కేవలం 44 బాల్స్ లోనే 7 సిక్సర్లు, 3 బౌండ్రీలతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా…మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.
203 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన కింగ్స్ పంజాబ్… 20 ఓవర్లలో 7 వికెట్లకు 185 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు రాహుల్ 42, క్రిస్ గేల్ 23, మయాంక్ అగర్వాల్ 35, డేవిడ్ మిల్లర్ 24 పరుగులు సాధించినా ప్రయోజనం లేకపోయింది.
బెంగళూరు విజయంలో ప్రధానపాత్ర వహించిన ఏబీ డివిలియర్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో బెంగళూరు 8 పాయింట్లు సాధించడం ద్వారా లీగ్ టేబుల్ 7వ స్థానంలో నిలిచింది.
ఈనెల 28న జరిగే 12వ రౌండ్లో ఢిల్లీ క్యాపిటల్స్, 29న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లతో బెంగళూరు తలపడాల్సి ఉంది.
రాహుల్ రికార్డు….
టీ-20ల్లో అత్యంత వేగంగా 3వేల పరుగుల మైలు రాయిని చేరిన భారత క్రికెటర్ గా పంజాబ్ ఓపెనర్ కెఎల్ రాహుల్ నిలిచాడు. కేవలం 93 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సొంతం చేసుకొన్నాడు.
200 స్కోర్లలో రాయల్ రికార్డు…
ఐపీఎల్ లో 200 స్కోర్లు సాధించడంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. 18సార్లు ఓ ఇన్నింగ్స్ లో 200కు పైగా స్కోరు నమోదు చేయగలిగింది.
చెన్నై సూపర్ కింగ్స్ 16 సార్లు, కింగ్స్ పంజాబ్ 12 సార్లు, కోల్ కతా నైట్ రైడర్స్ 10సార్లు, సన్ రైజర్స్ హైదరాబాద్ 9 సార్లు… 200కు పైగా స్కోర్లు సాధించిన జట్లుగా నిలిచాయి.