వన్డే ప్రపంచకప్ కు టీమిండియా బ్రాండ్ న్యూ జెర్సీలు

విరాట్ సేన కోసం నైకీ బ్రాండ్ దుస్తులు క్రికెట్లో ప్రపంచకప్ ఏదైనా….భారతజట్టు ధరించే జెర్సీలు లేదా దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. టీమిండియా జెర్సీల అధికారిక స్పాన్సర్ నైకీ…జెర్సీల తయారీలో వినూత్న పద్దతులు పాటిస్తోంది. తనవంతుగా సామాజికబాధ్యతను సైతం నిర్వర్తిస్తోంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా వచ్చే నెలలో ప్రారంభమయ్యే 2019 వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్ల కోసం…సరికొత్త డిజైన్ తో నైకీ అధికారిక దుస్తులను రూపొందించడమే కాదు.. ఓ ప్రత్యేక కార్యక్రమంలో అధికారికంగా […]

Advertisement
Update:2019-04-24 00:35 IST
  • విరాట్ సేన కోసం నైకీ బ్రాండ్ దుస్తులు

క్రికెట్లో ప్రపంచకప్ ఏదైనా….భారతజట్టు ధరించే జెర్సీలు లేదా దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. టీమిండియా జెర్సీల అధికారిక స్పాన్సర్ నైకీ…జెర్సీల తయారీలో వినూత్న పద్దతులు పాటిస్తోంది. తనవంతుగా సామాజికబాధ్యతను సైతం నిర్వర్తిస్తోంది.

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా వచ్చే నెలలో ప్రారంభమయ్యే 2019 వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్ల కోసం…సరికొత్త డిజైన్ తో నైకీ అధికారిక దుస్తులను రూపొందించడమే కాదు.. ఓ ప్రత్యేక కార్యక్రమంలో అధికారికంగా విడుదల చేసింది.

ఈ కార్యక్రమంలో నిన్నటి తరం క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, అజింక్యా రహానేలతో పాటు నేటి తరం క్రికెటర్ విరాట్ కొహ్లీ, రేపటి తరం క్రికెటర్ పృథ్వీ షా, మహిళా క్రికెటర్లు జెమీమా రోడ్రిగేజ్, హర్మన్ ప్రీత్ కౌర్ పాల్గొన్నారు.

టీమిండియా అధికారిక దుస్తుల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనటం తనకు గర్వకారణంగా ఉందని మాజీ కెప్టెన్, సీనియర్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పాడు.

రీసైకిల్ మెటీరియల్ తోనే ఈ దుస్తులను తయారు చేసినట్లు నైకీ ప్రకటించింది. వాడిపడేసిన వాటర్ బాటిల్స్ నుంచి తయారు చేసిన సింథటిక్ ఫైబర్ యార్న్ ను ఈ దుస్తుల తయారీకి ఉపయోగించినట్లు వివరాలు బయటపెట్టింది.

భారత క్రికెట్ జెర్సీల సాంప్రదాయ బ్లూకలర్ కు జాతీయ పతాకంలోని కాషాయం షేడ్ ను జత చేసి దుస్తులకు రూపకల్పన చేశారు. 2015 ప్రపంచకప్ నుంచి రీసైకిల్ చేసిన వాటర్ బాటిల్స్ యార్న్ తోనే.. భారత క్రికెటర్ల దుస్తులు తయారు చేస్తూ వస్తున్నారు.

అంతేకాదు…జట్టు సభ్యులకు అందచేసే కిట్ బ్యాగ్ లపై…గతంలో టీమిండియా నెగ్గిన మూడు ప్రపంచకప్ టోర్నీల తేదీలను, ఇతర వివరాలను సైతం ముద్రించారు. క్రికెటర్లు ధరించే షర్టుల కాలర్ వెనుకభాగంలో.. ఈ వివరాలను పొందు పరిచారు.

భారతజట్టు ప్రపంచకప్ నెగ్గిన సంవత్సరం,వేదిక,తేదీ వివరాలను ప్రత్యేకంగా ముద్రించడం ప్రస్తుత ప్రపంచకప్ జెర్సీల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

ఇంగ్లండ్ వేదికగా మే 30 నుంచి జులై 14 వరకూ జరిగే 2019 వన్డే ప్రపంచకప్ లో టెస్ట్ హోదా పొందిన పది అగ్రశ్రేణి జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే.

భారత్ కు 1983, 2011 వన్డే ప్రపంచకప్ టోర్నీలతో పాటు…2007 టీ-20 ప్రపంచకప్ నెగ్గిన రికార్డు ఉంది.

Tags:    
Advertisement

Similar News