ఇప్పుడు  జ్ఞానోదయం అయ్యిందా జేసీ గారు?

వృధ్ధ నారీ పతివ్రత… అన్న సామెత గుర్తొస్తుంది మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ నాయకుడు జే.సీ.దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వింటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలలో అభ్యర్థులు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని, ఒక వ్యక్తి తన విజయం కోసం కనీసం 50 కోట్లు ఖర్చు చేశారని జే.సీ.దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అటు రాజకీయ పార్టీలలోనూ, ఇటు రాజకీయ విశ్లేషకులు, తెలుగు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న […]

Advertisement
Update:2019-04-24 03:11 IST

వృధ్ధ నారీ పతివ్రత… అన్న సామెత గుర్తొస్తుంది మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ నాయకుడు జే.సీ.దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వింటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలలో అభ్యర్థులు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని, ఒక వ్యక్తి తన విజయం కోసం కనీసం 50 కోట్లు ఖర్చు చేశారని జే.సీ.దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అటు రాజకీయ పార్టీలలోనూ, ఇటు రాజకీయ విశ్లేషకులు, తెలుగు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న జే.సీ.దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు తాము పోటీ చేసిన ఎన్నికలలో విజయం సాధించేందుకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో గుర్తుందా..? అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన జే.సీ. దివాకర్ రెడ్డి తన రాజకీయ మనుగడ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుగు ప్రజలు అందరికీ తెలుసునని అంటున్నారు.

ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తరువాత అభ్యర్థుల ఖర్చుపై జే.సీ.దివాకర్ రెడ్డి మాట్లాడడం వింతగా ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులే అంటున్నారు. తన స్థానంలో తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డిని ఎన్నికల బరిలో దింపిన జే.సీ.దివాకర్ రెడ్డి కుమారుడి గెలుపు కోసం ఎంత ఖర్చు పెట్టారో బయట పెట్టగలరా అని ప్రశ్నిస్తున్నారు.

రాజకీయంగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఎన్నికల ఖర్చులపై మేథావులతో కలిసి పోరాడుతాను అంటూ జేసీ దివాకర్ రెడ్డి చేసిన ప్రకటన కళ్ళు మూసుకుని పాలు తాగిన పిల్లి చందాన ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అనంతపురం జిల్లాను తన గుప్పిట్లో పెట్టుకున్న జే.సీ.దివాకర్ రెడ్డి సోదరులు…. అధికారులకు కోట్లాది రూపాయలు ఇచ్చారని, ఆ విషయాలపై కూడా మేథావులతో చర్చిస్తే బాగుంటుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. వందలాది ప్రైవేటు బస్సులతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టిన జే.సీ.దివాకర్ రెడ్డి సోదరులు ఆ దోపిడీ పై కూడా మేథావులతో చర్చిస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

తన మందీ మార్బలంతో అనంతపురం జిల్లాను తన గుప్పిట్లో పెట్టుకున్న జే.సీ.దివాకర్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల ఖర్చులపై వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలుకుతున్నారు.

Tags:    
Advertisement

Similar News