ఐపీఎల్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో సన్ రైజర్స్ ఐదో గెలుపు
హైదరాబాద్ ఓపెనర్స్ ధూమ్ ధామ్ బ్యాటింగ్ టాప్ గేర్ లో డేవిడ్ వార్నర్… ఐపీఎల్ 9వ రౌండ్ మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ ఐదో విజయంతో…లీగ్ టేబుల్ నాలుగోస్థానంలో నిలిచింది. హోంగ్రౌండ్ రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో ముగిసిన.. ఏకపక్ష పోరులో సన్ రైజర్స్ 9 వికెట్ల విజయం సాధించింది. ఈమ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు […]
- హైదరాబాద్ ఓపెనర్స్ ధూమ్ ధామ్ బ్యాటింగ్
- టాప్ గేర్ లో డేవిడ్ వార్నర్…
ఐపీఎల్ 9వ రౌండ్ మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ ఐదో విజయంతో…లీగ్ టేబుల్ నాలుగోస్థానంలో నిలిచింది.
హోంగ్రౌండ్ రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో ముగిసిన.. ఏకపక్ష పోరులో సన్ రైజర్స్ 9 వికెట్ల విజయం సాధించింది.
ఈమ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ లిన్ 51 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
సమాధానంగా 160 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన సన్ రైజర్స్ కు ఓపెనర్లు బెయిర్ స్టో- వార్నర్ మొదటి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యంతో అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.
కేవలం 15 ఓవర్లలోనే సన్ రైజర్స్ విజయలక్ష్యాన్ని చేరుకోగలిగింది ఓపెనర్ బెయిర్ స్టో 80 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. హైదరాబాద్ పేసర్ ఖలీల్ అహ్మద్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
సన్ రైజర్స్ ఓపెనర్ల దనాధన్….
ఐపీఎల్ 12వ సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ లో ….హైదరాబాద్ సన్ రైజర్స్ ఓపెనింగ్ జోడీ జానీ బెయిర్ స్టో- డేవిడ్ వార్నర్ ల భాగస్వామ్యాల రికార్డు కొనసాగుతోంది.
హోంగ్రౌండ్ రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా…కోల్ కతా నైట్ రైడర్స్ తో ముగిసిన 9వ రౌండ్ మ్యాచ్ లో సైతం హైదరాబాద్ ఓపెనింగ్ జోడీ మొదటి వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో అదరగొట్టారు. ఈ ఇద్దరూ మొదటి వికెట్ కు131 పరుగుల భాగస్వామ్యంతో తమ జట్టు విజయంలో ప్రధానపాత్ర వహించారు.
గత తొమ్మిది ఇన్నింగ్స్ లో మొదటి వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయటం వార్నర్- బెయిర్ స్టో జోడీకి ఇది ఏడవసారి.
గతంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఓపెనింగ్ జోడీ విరాట్ కొహ్లీ- ఏబీ డివిలియర్స్ 13 ఇన్నింగ్స్ లో 10 హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేస్తే…హైదరాబాద్ ఓపెనింగ్ జోడీ కేవలం తొమ్మిది ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించడం విశేషం.
వండర్ వార్నర్…..
ఐపీఎల్ 12వ సీజన్లో…హైదరాబాద్ సన్ రైజర్స్ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీల పరంపర కొనసాగుతోంది.
ప్రస్తుత సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ లో వరుసగా ఐదో హాఫ్ సెంచరీ సాధించిన వార్నర్ .. కేవలం 68 ఇన్నింగ్స్ లోనే 34వ హాఫ్ సెంచరీ సాధించాడు.
ప్రతి రెండు ఇన్నింగ్స్ కు ఓ అర్ధశతకం బాదిన ఏకకై ఓపెనర్ గా వార్నర్ రికార్డుల్లో చేరాడు. హోంగ్రౌండ్ హైదరాబాద్ రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో ముగిసిన మ్యాచ్ లో వార్నర్…38 బాల్స్ లో 3 బౌండ్రీలు,5 సిక్సర్లతో 67 పరుగుల స్కోరు సాధించాడు.
ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ వార్నర్ ఆడిన ఎనిమిది మ్యాచ్ ల్లో 517 పరుగులు సాధించి..టాప్ స్కోరర్ గా ఆరెంజ్ క్యాప్ అందుకొన్నాడు.