మహిళా క్రికెట్లో వింత వివాహాలు
మహిళ ను మహిళే పెళ్లాడుతున్న వైనం సౌతాఫ్రికా, న్యూజిలాండ్ దేశాలలో లెస్బియన్ వివాహాలకు చట్టబద్ధత స్త్రీ, పురుషులు వివాహం చేసుకోడం ప్రకృతి ధర్మం. మానవజాతి పుట్టుక నుంచి వస్తున్న పరంపర. అయితే…ప్రకృతి విరుద్ధంగా…ఓ మహిళను మరో మహిళ పెళ్ళాడటం ఇటీవలి కాలంలో ఓ విడ్డూరంగా మారిపోయింది.ప్రధానంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా దేశాల మహిళా క్రికెటర్లలో….ఈ లెస్బియన్ పెళ్ళిళ్లు మనకు కనిపిస్తాయి. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ నికోలా హెన్ కాక్ గతవారమే…న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ హేలీ జెన్సన్ ను […]
- మహిళ ను మహిళే పెళ్లాడుతున్న వైనం
- సౌతాఫ్రికా, న్యూజిలాండ్ దేశాలలో లెస్బియన్ వివాహాలకు చట్టబద్ధత
స్త్రీ, పురుషులు వివాహం చేసుకోడం ప్రకృతి ధర్మం. మానవజాతి పుట్టుక నుంచి వస్తున్న పరంపర. అయితే…ప్రకృతి విరుద్ధంగా…ఓ మహిళను మరో మహిళ పెళ్ళాడటం ఇటీవలి కాలంలో ఓ విడ్డూరంగా మారిపోయింది.ప్రధానంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా దేశాల మహిళా క్రికెటర్లలో….ఈ లెస్బియన్ పెళ్ళిళ్లు మనకు కనిపిస్తాయి.
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ నికోలా హెన్ కాక్ గతవారమే…న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ హేలీ జెన్సన్ ను తన జీవితభాగస్వామిగా చేసుకొంది. ఆస్ట్రేలియా మహిళా టీ-20 బిగ్ బాష్ లీగ్ లో… గత మూడేళ్లుగా…వేర్వేరుజట్లకు ఆడుతున్న సమయంలో ఈ ఇద్దరి మగువల మనసులు కలిశాయి. ఇంకేముంది…క్రికెట్ సంగతేమో కానీ…జీవితంలో భాగస్వాములు కావాలని నిర్ణయించుకొన్నారు.
ఇద్దరూ వేర్వేరు దేశాలకు చెందినవారు కావడంతో…పలు రకాల సమస్యలు ఎదురైనా…వాటిని విజయవంతంగా అధిగమించి..ఒక్కటయ్యారు.
న్యూజిలాండ్ లో పురుషులను పురుషులు, మహిళలను మహిళలు పెళ్ళాడటాన్ని 2013 ఆగస్టు 19 నుంచి చట్టబద్ధం చేశారు.మహిళలను మహిళలు, పురుషులను పురుషుల పెళ్లాడే విషయమై…న్యూజిలాండ్ పార్లమెంట్ లో 2013 ఏప్రిల్ 17న చర్చ తర్వాత ఓటింగ్ నిర్వహించారు. 77-44 ఓట్ల తేడాతో….
లెస్బియన్ వివాహాలకు ఆమోదం లభించింది.
ఇదే మొదటి పెళ్లికాదు..
మహిళా క్రికెటర్ల చరిత్రను తిరగేస్తే…..లెస్బిబియన్ వివాహాలు గతంలోనూ జరిగాయి. దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్లు డానీ వాన్ నీకార్క్, మారియాన్ కాప్ ..అధికారికంగా పెళ్లాడిన తొలి మహిళా క్రికెటర్ల జంటగా
చరిత్రలో మిగిలారు.న్యూజిలాండ్ క్రికెటర్లు యమీ సాటర్త్ వెయిట్- లియా తహుహు సైతం ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకొన్నారు. అధికారికంగా పెళ్లాడిన రెండో లెస్బియన్ జంటగా నిలిచారు.