మామిడి... ప్రొటీన్ల రారాజు..

పండ్లలో రారాజు ఎవరంటే ఖచ్చితంగా మామిడిపండు అని ఒప్పుకుని తీరాల్సిందే.. వేసవి కాలం వచ్చిదంటే పిల్లలు…పెద్దలు కూడా మామిడి పళ్ల కోసం ఎదురు చూస్తారు. అయితే మామిడి పళ్లు ఎంత రుచికే కాదు… విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లకూ ప్రసిద్ధి…. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఏడాదికి ఒక్కసారే కదా అని ఎక్కువగా తింటే ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి అంటున్నారు వైద్య నిపుణులు. మామిడి పండు వల్ల కలిగే ప్రయోజనాలు…దుష్ప్రయోజనాలు ఏమిటో […]

Advertisement
Update:2019-04-21 07:51 IST

పండ్లలో రారాజు ఎవరంటే ఖచ్చితంగా మామిడిపండు అని ఒప్పుకుని తీరాల్సిందే.. వేసవి కాలం వచ్చిదంటే పిల్లలు…పెద్దలు కూడా మామిడి పళ్ల కోసం ఎదురు చూస్తారు. అయితే మామిడి పళ్లు ఎంత రుచికే కాదు… విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లకూ ప్రసిద్ధి…. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఏడాదికి ఒక్కసారే కదా అని ఎక్కువగా తింటే ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి అంటున్నారు వైద్య నిపుణులు. మామిడి పండు వల్ల కలిగే ప్రయోజనాలు…దుష్ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా మరి.

* మామిడి పండులో ఉన్న విటమిన్ సి శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

* వీటిలో ఉన్న యాంటీ ఫంగల్ గుణాలు చిగుళ్ల సమస్యలు, దంతాలకు సంబంధించిన ఇతర సమస్యల నుంచి కాపాడుతుంది.

* నోటిలో ఉన్న బ్యాక్టీరియాను నశింప చేస్తుంది. దంతాలపై ఉన్న ఎనామిల్ ను కాపాడుతుంది.

* మామిడి పండులో ఉన్న పీచు మలబద్దకాన్ని నివారించడమే కాకుండా, అజీర్ణ సమస్యలను నివారిస్తుంది.

* వీటిలో అధిక మొత్తంలో ఐరన్ ఉంది. ఇది ఎనీమియా, రక్తహీనత నుంచి కాపాడుతుంది.

* మామిడి పండులో విటమిన్ ఏ కంటి సమస్యలను నివారించడమే కాదు… కంటి చూపును కూడా మెరుగు పరుస్తుంది.

* మామిడి పండులో యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధినిరోధక శక్తిని పెంచడంతో పాటు క్యాన్సర్ కారక క్రిములను నశింప చేస్తాయి.

* మామిడి పండులో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఈ శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంతో పాటు…. శరీరం కాంతి వంతంగా తయారు కావడానికి తోడ్పడతాయి.

* మామిడిపండులో ఉన్న పొటాషియం, క్యాలిషియం, మెగ్నీషియం బీపీని అదుపు చేయడంతో పాటు గుండెకు ఆరోగ్యవంతమైన రక్తాన్ని అందిస్తాయి.

* మామిడి పండులో ఉన్న కాపర్ శరీరంలో ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో సాయపడుతుంది.

* రేచీకటితో బాధపడుతున్న వారికి మామిడి పండు దివ్యౌషధం. ఒక మామిడి పండుతో శరీరానికి దాదాపుగా 30 నుంచి 40 క్యాలరీల శక్తి అందుతుంది.

* మామిడి పండు వ్రుద్దాప్య సమస్యలను తగ్గిస్తుంది.

* మామిడి పండు లో దాదాపు 32 శాతం విటమిన్ ఎ ఉంది. ఇది సెబమ్ అనే ప్రొటీన్ తయారు చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. సెబమ్ జుట్టుకు బలాన్ని ఇవ్వడమే కాకుండా మాశ్చరైజర్ లా కూడా పనిచేస్తుంది.

*ఇందులో ఉన్న విటమిన్ బి6 మన మూడ్ మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది. మెదడును చురుగ్గా ఉంచుతుంది.

ఇన్ని ప్రయోజనాలకు ఉన్నా… మామిడి పండు వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి.

* మామిడిపండు డయాబెటీస్ వ్యాధి ఉన్న వారు ఎక్కువగా తినకూడదు. అయితే వైద్యుల సలహా మేరకు తక్కువగా తినాలి.

* మామిడి పళ్లు ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

* ఈ పళ్లు శరీరానికి వేడి చేస్తాయి. ఎక్కువగా తింటే శరీరంపై వేడి కురుపులు, సెగడ్డలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి..

వేసవి కాలంలో వచ్చే మామిడి పళ్లను అతిగా కాకుండా తగిన మోతాదులో తీసుకుని వేసవిని ఎన్జాయ్ చేయండి.

Tags:    
Advertisement

Similar News