స్వయం ప్రతిపత్తి ఉన్నది... ఎన్నికల కమిషన్‌కా? చంద్రబాబుకా?

అవును ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు తీసుకునే నిర్ణయాలను చూస్తే ఇలాగే అనిపిస్తోందంటున్నారు చాలామంది అధికారులు, మేధావులు, సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు. దేశంలో స్వయం ప్రతిపత్తి ఉన్నది ఎన్నికల సంఘానికా? చంద్రబాబుకా? అని ప్రశ్నించుకుంటున్నారు. దేశంలో ఏ రాష్ట్ర సీఎం చేయని చిత్ర విచిత్రాలను ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు చేస్తున్నారంటున్నారు. సీబీఐ, ఐటీ, ఈడీ వంటి కేంద్ర స్వతంత్ర సంస్థలను ఆంధ్రప్రదేశ్‌ నుంచి బహిష్కరించినట్లుగానే ఇప్పుడు ఎన్నికల కమిషన్‌ను కూడా బహిష్కరించినట్లుగానే అనిపిస్తోందంటున్నారు. ఓటింగ్‌ మొదలై గంట కూడా కాకముందే 30 […]

Advertisement
Update:2019-04-19 12:10 IST

అవును ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు తీసుకునే నిర్ణయాలను చూస్తే ఇలాగే అనిపిస్తోందంటున్నారు చాలామంది అధికారులు, మేధావులు, సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు. దేశంలో స్వయం ప్రతిపత్తి ఉన్నది ఎన్నికల సంఘానికా? చంద్రబాబుకా? అని ప్రశ్నించుకుంటున్నారు. దేశంలో ఏ రాష్ట్ర సీఎం చేయని చిత్ర విచిత్రాలను ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు చేస్తున్నారంటున్నారు. సీబీఐ, ఐటీ, ఈడీ వంటి కేంద్ర స్వతంత్ర సంస్థలను ఆంధ్రప్రదేశ్‌ నుంచి బహిష్కరించినట్లుగానే ఇప్పుడు ఎన్నికల కమిషన్‌ను కూడా బహిష్కరించినట్లుగానే అనిపిస్తోందంటున్నారు.

ఓటింగ్‌ మొదలై గంట కూడా కాకముందే 30 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదు అంటూ చంద్రబాబు ఈసీ పై సంచలన ఆరోపణలే చేశారు. అయితే ఈవీఎంలపై చంద్రబాబు చేసిన ఆరోపణలు తప్పని…. ఈవీఎంలు పనిచేయకపోతే 80 శాతానికి పైగా ఓటింగ్‌ ఎలా జరిగిందని….. ఎలక్షన్‌ కమిషనే స్వయంగా ప్రకటన చేసింది.

తన ఓటు ఎవరికి పడిందో తనకే తెలియదని మరో కామెంట్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తరువాత 8 వారాలపాటు అప్పటివరకు ఉన్న అధ్యక్షుడే ఆ పదవిలో ఉంటాడని…. జూన్‌ 8 వ తేదీ వరకు తానే సీఎంనని ప్రకటించుకుని అందరినీ అవాకయ్యేలా చేశాడు.

ఒక్కసారి ఎలక్షన్‌ కోడ్‌ అమలులోకి వస్తే…. ఆ క్షణం నుంచి రాష్ట్రంలో పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోకూడదన్న నిబంధన ఉంది. కోడ్‌ అమలులో ఉన్నంత వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా…. మొదట ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్ళాలి. ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇస్తేనే ఆ నిర్ణయాలు అమలులోకి వస్తాయి. కానీ చంద్రబాబు మాత్రం అటువంటి నిబంధనలు అంటూ తనకు వర్తించవన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు.

అయితే ఈసీ నిబంధనలను దిక్కరించి సెక్రెటేరియట్‌ లో పోలవరం, రాజధాని వంటి పాలనాపరమైన సమీక్షలు నిర్వహించి 24 గంటలు గడవకముందే చంద్రబాబు మరో సాహసం చేశాడు.

ఈసారి ఏకంగా కాపు కార్పొరేషన్‌ ఎండీ శివశంకర్‌ను ఆకస్మిక బదిలీ చేశాడు. దీంతో ఎన్నికల కమిషన్‌ ముందుకు మరో కొత్త వివాదం చేరింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు బదిలీకి ఈసీ అనుమతి తప్పనిసరి. కానీ చంద్రబాబు అవేమీ పట్టించుకోలేదు. బదిలీ చేసేశాడు.

ఈసీ అనుమతి తీసుకోకుండానే కాపు కార్పొరేషన్‌ ఎండీ శివశంకర్‌ను బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం.
దీంతో శివశంకర్‌ బదిలీ వ్యవహారం ఈసీ దృష్టికి వెళ్ళింది. తమ అనుమతి లేకుండా బదిలీ చేయడంపై ఈసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు రాష్ట్రస్థాయి అధికారిని బదిలీ చేయడం పై అధికార వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది.

అయితే నిన్న సమీక్షా సమావేశం నిర్వహించి చంద్రబాబు కోడ్‌ ఉల్లంఘించాన్న ఫిర్యాదు పై ఈసీ దృష్టి సారించింది. కోడ్‌ ఉల్లంఘనలపై ఈరోజు ఈసీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ కోరింది. సీఎం సమీక్షలో పాల్గొన్న అధికారులకు సీఎస్‌ నోటీసులు కూడా పంపారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా సీఎం సమీక్షల్లో పాల్గొనడం పై ప్రధాన కార్యదర్శి… సీఆర్డీఏ, జలవనరుల శాఖ వివరణ కోరారు.

Tags:    
Advertisement

Similar News