గెలుపు మనదే.... భ్రమల్లో బాబు అంటున్న తెలుగు తమ్ముళ్ళు
“మనం 120 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తున్నాం. మనమే మళ్లీ అధికారంలోకి వస్తాం” చంద్రబాబు నాయుడు తెలుగు దేశం అభ్యర్థులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో వ్యాఖ్యలు ఇవి. రెండు రోజుల క్రితం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ అభ్యర్థులతో, సీనియర్ నాయకులతో పలు దఫాలుగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రెండు నిమిషాలకు ఒకసారి ఎవరు అడిగినా… అడగకున్నా తామే అధికారంలోకి వస్తున్నామంటూ పదేపదే ప్రకటించారు. కొందరు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో పరిస్థితులు సరిగా లేవని, […]
“మనం 120 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తున్నాం. మనమే మళ్లీ అధికారంలోకి వస్తాం” చంద్రబాబు నాయుడు తెలుగు దేశం అభ్యర్థులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో వ్యాఖ్యలు ఇవి.
రెండు రోజుల క్రితం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ అభ్యర్థులతో, సీనియర్ నాయకులతో పలు దఫాలుగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రెండు నిమిషాలకు ఒకసారి ఎవరు అడిగినా… అడగకున్నా తామే అధికారంలోకి వస్తున్నామంటూ పదేపదే ప్రకటించారు.
కొందరు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో పరిస్థితులు సరిగా లేవని, తాము గెలవడం అసాధ్యమని చెబుతున్నా చంద్రబాబు ఆ మాటలను పట్టించుకోలేదు అని చెబుతున్నారు. కొందరు సీనియర్ నాయకులు వాస్తవ పరిస్థితులను వివరిస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు వారిని వారించారని, ఎన్నికల్లో విజయం తమదేనంటూ మాటిమాటికి చెప్పారని తెలుగు తమ్ముళ్ళు తమ సన్నిహితుల వద్ద వాపోయారంటున్నారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితి తమకు అనుకూలంగా లేదని ఎంత చెప్పినా చంద్రబాబు నాయుడు వినిపించుకునే పరిస్థితిలో లేరని, ఆయన ఎలాంటి భ్రమలో ఉన్నారో తెలియడం లేదని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యిందని, కొన్ని జిల్లాలలో అది మరింత తీవ్రంగా ఉందని తమ్ముళ్లు టెలీ కాన్ఫరెన్స్ లో చెబుతున్నా చంద్రబాబు నాయుడు మాత్రం వాటిని పట్టించుకోలేదని అంటున్నారు.
క్షేత్ర స్థాయిలో నిర్వహించిన సర్వేలలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయని తేలిందని చెబుతున్న చంద్రబాబు నాయుడు ఆ సర్వేలన్నీ తమ వారితోనే చేయించామనే స్పృహ కోల్పోతున్నారని వారు అంటున్నారు.
పార్టీ సీనియర్ నాయకులు అందరూ ఈ ఎన్నికలలో విజయం సాధించడం కష్టం అని, ప్రజలు తమ వైపు అనుకూలంగా లేరని ఎంత చెప్పినా చంద్రబాబు నాయుడు ఆ మాటల్ని పట్టించుకోవడం లేదని, తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందనే భ్రమల్లోంచి ఆయన బయట పడటం లేదని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు.