చెన్నై సూపర్ కింగ్స్ కు సన్ రైజర్స్ దెబ్బ

ధోనీ లేని సూపర్ కింగ్స్ చిత్తు చిత్తు బ్యాటింగ్ లో వార్నర్…బౌలింగ్ లో రబాడా వీవో ఐపీఎల్ 8వ రౌండ్ మ్యాచ్ లో….హైదరాబాద్ సన్ రైజర్స్ విజయం సాధించి…లీగ్ టేబుల్ ఐదోస్థానానికి చేరింది. హోంగ్రౌండ్ రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన 8వ రౌండ్ మ్యాచ్ లో… డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ను సన్ రైజర్స్ 6 వికెట్లతో చిత్తు చేసింది. ఈ కీలక మ్యాచ్ లో…టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న చెన్నై […]

Advertisement
Update:2019-04-18 11:30 IST
చెన్నై సూపర్ కింగ్స్ కు సన్ రైజర్స్ దెబ్బ
  • whatsapp icon
  • ధోనీ లేని సూపర్ కింగ్స్ చిత్తు చిత్తు
  • బ్యాటింగ్ లో వార్నర్…బౌలింగ్ లో రబాడా

వీవో ఐపీఎల్ 8వ రౌండ్ మ్యాచ్ లో….హైదరాబాద్ సన్ రైజర్స్ విజయం సాధించి…లీగ్ టేబుల్ ఐదోస్థానానికి చేరింది.

హోంగ్రౌండ్ రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన 8వ రౌండ్ మ్యాచ్ లో… డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ను సన్ రైజర్స్ 6 వికెట్లతో చిత్తు చేసింది. ఈ కీలక మ్యాచ్ లో…టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న చెన్నై సూపర్ కింగ్స్ ను….20 ఓవర్లలో 5 వికెట్లకు 132 పరుగులకే పరిమితం చేసింది.

ఓపెనర్లు వాట్సన్ 31, డూప్లెసి 45 పరుగులు, రాయుడు 25 పరుగుల నాటౌట్ స్కోర్లతో నిలిచారు. సమాధానంగా 133 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన సన్ రైజర్స్ కు… ఓపెనర్లు బెయిర్ స్టో-వార్నర్ మొదటి వికెట్ కు 66 పరుగుల భాగస్వామ్యంతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు.

వార్నర్ నాలుగో హాఫ్ సెంచరీ….

వార్నర్ కేవలం 25 బాల్స్ లో 10 బౌండ్రీలతో 50 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. మరో ఓపెనర్ బెయిర్ స్టో..61పరుగుల నాటౌట్ స్కోరుతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

ప్రస్తుత ఐపీఎల్ లో వార్నర్ కు ఇది వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ కావడం ఓ విశేషం. మొదటి తొమ్మిది రౌండ్లలో చెన్నై సూపర్ కింగ్స్ కు ఇది రెండో ఓటమి కాగా… ఎనిమిది రౌండ్లలో సన్ రైజర్స్ కు… నాలుగో విజయంగా ఉంది.

చెన్నై పై రెండో హోం విన్….

వీవో ఐపీఎల్ లో…చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్థిగా…. హైదరాబాద్ సన్ రైజర్స్ తన రికార్డును స్వల్పంగా మెరుగుపరచుకొంది.

2019 ఐపీఎల్ సీజన్ లో భాగంగా జరిగిన హోం మ్యాచ్ లో సన్ రైజర్స్ 5 వికెట్ల విజయంతో ఊపిరి పీల్చుకొంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన ఈ కీలక సమరంలో సన్ రైజర్స్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది.

12 మ్యాచ్ ల్లో మూడో గెలుపు….

గత 12 సీజన్లలో ఇప్పటి వరకూ… చెన్నై సూపర్ కింగ్స్ తో 11సార్లు తలపడిన హైదరాబాద్ సన్ రైజర్స్ కు 3 విజయాలు, 8 పరాజయాల రికార్డు మాత్రమే ఉంది.

సూపర్ కింగ్స్ తో ఆడిన గత ఐదు మ్యాచ్ ల్లో.. సన్ రైజర్స్ కు ఇదే తొలిగెలుపు కావడం విశేషం. అంతేకాదు…హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా…. చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడిన గత నాలుగు మ్యాచ్ ల్లో… సన్ రైజర్స్ కు ఇది రెండో గెలుపు కాగా..2-2తో సమఉజ్జీగా నిలిచింది.

హోంగ్రౌండ్ రాజీవ్ స్టేడియం వేదికగా 2015లో నెగ్గిన సన్ రైజర్స్ కు… ఆ తర్వాత ఇదే తొలిగెలుపు కావడం మరో విశేషం.

ధోనీ మిస్సింగ్ రికార్డు….

ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోనీ… ధోనీ అంటే చెన్నై సూపర్ కింగ్స్ అని క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ధోనీ లేని చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఊహించడం అనూహ్యమే. అయితే…హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ తో ముగిసిన మ్యాచ్ లో …టేబుల్ టాపర్ చెన్నై జట్టు…సురేశ్ రైనా కెప్టెన్ గా.. బరిలోకి దిగింది.

రైనా నాయకత్వంలో చెన్నై….

వెన్నెముక గాయంతో బాధ పడుతున్న ధోనీ మ్యాచ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోడంతో….కెప్టెన్ గా రైనా జట్టు పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది.

2010 తర్వాత… ధోనీ లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు… ఐపీఎల్ బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా… ధోనీ ఏకబిగిన 121 మ్యాచ్ లు ఆడటం ఓరికార్డుగా మిగిలిపోతుంది.

ప్రస్తుత సీజన్లో …ఎనిమిది మ్యాచ్ లు ఆడిన ధోనీ రెండు హాఫ్ సెంచరీలతో సహా…మొత్తం 230 పరుగులు సాధించాడు. అంతేకాదు…గత 12 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో …ధోనీ మ్యాచ్ కు దూరం కావడం ఇది కేవలం నాలుగోసారి మాత్రమే.

వార్నర్-రబాడా ఇద్దరూ ఇద్దరే….

ఐపీఎల్ 12వ సీజన్…మొదటి తొమ్మిదిరౌండ్ల మ్యాచ్ లు ముగిసే సమయానికి… బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో డేవిడ్ వార్నర్, కిర్గిసో రబాడా అగ్రస్థానాలలో నిలిచారు.

డేవిడ్ వార్నర్ మొత్తం ఎనిమిది మ్యాచ్ ల్లో… ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలతో సహా 450 పరుగులు సాధించి… ఆరెంజ్ క్యాప్ అందుకొన్నాడు.

ఇక…బౌలింగ్ విభాగంలో ఢిల్లీ క్యాపిటల్స్ మెరుపు ఫాస్ట్ బౌలర్ కిర్గిసో రబాడా 8 మ్యాచ్ ల్లో 17 వికెట్లు పడగొట్టి… బౌలర్ నంబర్ వన్ గా నిలిచాడు. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ కు ఇచ్చే పర్పుల్ క్యాప్ సాధించాడు.

ఆఖరి ఆరు రౌండ్ల మ్యాచ్ ల్లో ఈ ఇద్దరూ ఇదేజోరు కొనసాగిస్తారా…. వేచిచూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News