లోకేష్ కు పోటీ లోకేషే.... అందరినీ సైడ్ చేస్తున్న బాబు

తండ్రి చాటు బిడ్డలా ఎదిగిన రాజకీయ నేతలు కొద్దిమంది మాత్రమే సక్సెస్‌ అయ్యారు. తెలంగాణలో కేసీఆర్ వారుసుడిగా కేటీఆర్ హిట్ అయ్యారు. తమిళనాట కరుణానిధి కుమారుడు స్టాలిన్ నిరూపించుకున్నారు. యూపీలో ములాయం కుమారుడు అఖిలేష్ సత్తా చాటుతున్నాడు. ఇలా కొందరు సక్సెస్‌ అయితే…. ఏపీలో మాత్రం చంద్రబాబుకు గుండెలపై భారంగా లోకేష్ బాబు తయారయ్యాడన్న విమర్శ ఉంది. లోకేష్ కు కోచింగ్ లు ఇప్పించి మరీ మెరుగుపరచాలని చూస్తున్నా ఆయన భాషా జ్ఞానం మారడం లేదు.. వ్యవహారశైలిలో […]

Advertisement
Update:2019-04-16 06:20 IST

తండ్రి చాటు బిడ్డలా ఎదిగిన రాజకీయ నేతలు కొద్దిమంది మాత్రమే సక్సెస్‌ అయ్యారు. తెలంగాణలో కేసీఆర్ వారుసుడిగా కేటీఆర్ హిట్ అయ్యారు. తమిళనాట కరుణానిధి కుమారుడు స్టాలిన్ నిరూపించుకున్నారు. యూపీలో ములాయం కుమారుడు అఖిలేష్ సత్తా చాటుతున్నాడు. ఇలా కొందరు సక్సెస్‌ అయితే…. ఏపీలో మాత్రం చంద్రబాబుకు గుండెలపై భారంగా లోకేష్ బాబు తయారయ్యాడన్న విమర్శ ఉంది.

లోకేష్ కు కోచింగ్ లు ఇప్పించి మరీ మెరుగుపరచాలని చూస్తున్నా ఆయన భాషా జ్ఞానం మారడం లేదు.. వ్యవహారశైలిలో మచ్చుకైనా మార్పు రావడం లేదు.

లోకేష్ ను ఎలాగైనా తన వారసుడిగా ప్రొజెక్ట్ చేయడానికి ఇప్పటికే నందమూరి వారసులను సైడ్ చేసిన చంద్రబాబు…. ఇప్పుడు కొత్తగా మరో వ్యక్తికి కూడా ఎసరు పెట్టాడన్న వార్త పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతోంది.

బాలక్రిష్ణ పెద్దల్లుడు లోకేష్ బాబు ఇప్పుడు చంద్రబాబు తర్వాత అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇక బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ ను కావాలనే బాబు సైడ్ చేస్తున్నారట.. మొన్నటి ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటును ఆఖరి వరకూ ఇవ్వకుండా భరత్ ను ముప్పతిప్పలు పెట్టిన బాబు.. గత్యంతరం లేక బాలకృష్ణ మాట కాదనలేక టిక్కెట్‌ ఇచ్చినా…. ఆయనను ఓడించడానికి ఆ ఎన్నికల్లో జనసేన ఎంపీ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణకు పూర్తి సహకారం అందించాల్సిందిగా టీడీపీ శ్రేణులను ఆదేశించారట.

ఈ విషయం తెలిసిన శ్రీభరత్ ఇప్పుడు నారా వారి కుటుంబానికి అదే సమయంలో మామ బాలయ్యతో మాట్లాడకుండా సైలెంట్ అయ్యారట.. తాజాగా నారావారి దగ్గరి ఫ్యామిలీలో జరిగిన ఓ వేడుకకు కూడా హాజరు కాలేదట..

ఇలా బాలయ్య తన కొడుక్కి పోటీ రాకుండా నందమూరి ఫ్యామిలీని ఇప్పటికే సైడ్ చేశారు. ఇప్పుడు లోకేష్ తోడల్లుడిని కూడా దూరం పెట్టడం టీడీపీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    
Advertisement

Similar News