కోడెలపై కేసు నమోదు

ఎన్నికల రోజున గుంటూరు జిల్లా, రాజుపాలెం మండలం, ఇనిమెట్ల గ్రామంలో స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు ప్రవర్తన వివాదాస్పదం అయింది. పోలింగ్‌ జరుగుతున్న సమయంలో 160వ నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లోకి వెళ్ళి ఆయన తలుపులకు గడియలు పెట్టేసి పోలింగ్‌ జరుగుతున్న గదిలోకి ఎవ్వరినీ రానివ్వడకుండా గంటన్నర సేపు ఆ గదిలోనే కూర్చున్నాడు. దీంతో ఓటు వేయడానికి వచ్చి బయట క్యూలో ఎదురుచూస్తున్న ఓటర్లకు చిర్రెత్తుకొచ్చింది. రిగ్గింగ్ కు పాల్పడుతున్నాడని బయట ఓటర్లు గొడవ చేశారు. తలుపు తీయాలని, కోడెలను […]

Advertisement
Update:2019-04-16 12:50 IST

ఎన్నికల రోజున గుంటూరు జిల్లా, రాజుపాలెం మండలం, ఇనిమెట్ల గ్రామంలో స్పీకర్‌ కోడెల శివప్రసాద రావు ప్రవర్తన వివాదాస్పదం అయింది. పోలింగ్‌ జరుగుతున్న సమయంలో 160వ నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లోకి వెళ్ళి ఆయన తలుపులకు గడియలు పెట్టేసి పోలింగ్‌ జరుగుతున్న గదిలోకి ఎవ్వరినీ రానివ్వడకుండా గంటన్నర సేపు ఆ గదిలోనే కూర్చున్నాడు.

దీంతో ఓటు వేయడానికి వచ్చి బయట క్యూలో ఎదురుచూస్తున్న ఓటర్లకు చిర్రెత్తుకొచ్చింది. రిగ్గింగ్ కు పాల్పడుతున్నాడని బయట ఓటర్లు గొడవ చేశారు. తలుపు తీయాలని, కోడెలను బయటకు పంపించాలని ఓటర్లు గొడవ గొడవ చేశారు. నేను ఇక్కడే ఉంటాను ఏం చేసుకుంటారో చేసుకోండి అని కోడెల తలుపు తీయలేదు. దాంతో ఓటర్లు కోడెల పై తిరుగుబాటు చేశారు.

కోడెల సొమ్మసిల్లి కింద పడిపోయినట్లుగా పడిపోయాడు. ఆ వీడియో కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. ఆయనను బయటకు తీసుకొచ్చేసరికి ఆయన బట్టలు చినిగిపోయి ఉన్నాయి. ఇదంతా సోషల్‌ మీడియాలో విపరీతంగా ప్రచారం అయింది. కోడెల పై దాడి చేశారంటూ అనేక మంది వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేశారు.

ఆ సమయంలో ఆ గ్రామానికే రాని అంబటి రాంబాబు లాంటి నాయకులమీద కూడా కోడెల పై హత్యాయత్నం చేసినట్లుగా కేసు నమోదు చేశారు. రాంబాబే కాకుండా నిమ్మకాయల రాజనారాయణ, బాసు లింగారెడ్డి ఇంకా చాలామంది పై కేసులు నమోదు చేశారు. ఆ రాత్రికి రాత్రే 20-30 మందిని అరెస్టు చేశారు.

అయితే ఎన్నికలు జరుగుతున్న గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసి గంటన్నరపాటు ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలిగిస్తూ బూత్ ఆక్రమణకు పాల్పడ్డ కోడెల పై మాత్రం ఇంత వరకూ కేసు నమోదు చేయలేదు. వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు.

ప్రతిపక్ష నేత జగన్‌ మంగళవారం నాడు గవర్నర్‌ను కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేస్తాడని తెలియడంతో పోలీసులు స్పందించారు. కోడెల, మరో 21 మంది పై సోమవారం రాత్రి రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    
Advertisement

Similar News