ఈ చిల్లర మాటలు ఏమిటి చంద్రబాబూ?

చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అయ్యాడు గానీ…. చాలా కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉంటే ఉన్నాడు గానీ…. అంత పెద్ద పదవి నిర్వహించిన వాళ్ళకు ఉండాల్సిన హుందాతనం గానీ, సంస్కారం గానీ చంద్రబాబులో లోపించాయనిపిస్తుంది. నిన్న తాజాగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదీని ఉద్దేశించి…. ఆయన నా దగ్గర పనిచేశాడు… అంటూ కామెంట్‌ చేయడం చూసినవాళ్ళు…. చంద్రబాబు వైఖరిని ఏవగించుకుంటున్నారు. ఒక్క ద్వివేదీనే అని కాదు… ఏ అధికారి ప్రస్తావన వచ్చినా, ఏ నాయకుడి ప్రస్తావన వచ్చినా…. […]

Advertisement
Update:2019-04-16 06:23 IST

చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అయ్యాడు గానీ…. చాలా కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉంటే ఉన్నాడు గానీ…. అంత పెద్ద పదవి నిర్వహించిన వాళ్ళకు ఉండాల్సిన హుందాతనం గానీ, సంస్కారం గానీ చంద్రబాబులో లోపించాయనిపిస్తుంది.

నిన్న తాజాగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదీని ఉద్దేశించి…. ఆయన నా దగ్గర పనిచేశాడు… అంటూ కామెంట్‌ చేయడం చూసినవాళ్ళు…. చంద్రబాబు వైఖరిని ఏవగించుకుంటున్నారు. ఒక్క ద్వివేదీనే అని కాదు… ఏ అధికారి ప్రస్తావన వచ్చినా, ఏ నాయకుడి ప్రస్తావన వచ్చినా…. ఆయన మాట తీరు ఇదే.

తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు విషయంలోనూ ఎప్పుడూ ఇదే పాట. ఆయన నా దగ్గర పనిచేశాడు…. నా కింద పనిచేశాడు…. అంటూ ఏదో ఆయన ఇంట్లో చాలా కాలం పాటు కూలీగా పనిచేసిన వ్యక్తి గురించి చెప్పినట్టు చెబుతాడు. ఇలాగే అనేకమంది రాజకీయ నాయకుల గురించి ఇదే మాట మాట్లాడుతాడు.

తమాషా ఏమిటంటే ఈయనకన్నా ముందునుంచే పార్టీలో ఉన్న వాళ్ళ గురించి ప్రస్తావన వచ్చినా…. ఇదే మాట. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల గురించీ ఇదే మాట.

ఇలాగే కాంగ్రెస్‌ వాళ్ళు కూడా చంద్రబాబు గురించి మాట్లాడితే? చంద్రబాబు కాంగ్రెస్‌ లో ఉన్నప్పుడు ఆ పార్టీలో పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు చంద్రబాబు గురించి ఇదే విధంగా మాట్లాడితే?

దేశంలోకెల్లా సీనియర్‌ నాయకుడినంటాడు. ఏం నేర్చుకున్నట్టు? ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్‌ సింగ్‌ ఆయన ఆఫీసులో అధికారిగా పనిచేశాడు. ఆ తరువాత మన్మోహన్‌ సింగ్‌ అదృష్టం బాగుండి ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన మంత్రి వర్గంలో ప్రణబ్ ముఖర్జీ మంత్రిగా పనిచేశాడు. కానీ ఏనాడు ప్రణబ్‌‌…. మన్మోహన్‌ గురించి…. ఇలా గతంలో నా దగ్గర పనిచేశాడంటూ నోరు పారేసుకోలేదు.

అనేక పార్టీల్లో చిన్న నాయకులుగా ఉన్నవాళ్ళు రాష్ట్రపతులయ్యారు. వాళ్ళను రాష్ట్రపతి స్థానంలో కూర్చోబెట్టిన అధికార పార్టీ నాయకులు ఎప్పుడూ వాళ్ళను రాష్ట్రపతిగా గౌరవించారే గానీ…. నా దగ్గర పనిచేశాడంటూ కామెంట్‌ చేయలేదు.

బహుశా భారత రాజకీయాల్లోనే…. ఇలా నా దగ్గర పనిచేశాడు…. నా కింద పనిచేశాడు…. అంటూ చిల్లర మాటలు మాట్లాడే ఏకైక వ్యక్తి చంద్రబాబే అనుకుంటా…!

Tags:    
Advertisement

Similar News