చంద్రబాబు పై మండిపడ్డ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు.... గవర్నర్‌ కు ఫిర్యాదు

ఏపీ చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం‌, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదీ పై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు రిటైర్డ్‌ ఐఏఎస్‌ల బృందం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ బృందంలో ఐవైఆర్, అజయ్‌కల్లం, గోపాల్‌రావు తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదీ, ఎల్వీ సుబ్రహ్మణ్యం ల పై చంద్రబాబు నిందారోపణలు చేయడం సరికాదన్నారు. తమ నిరసనను గవర్నర్‌కు తెలిపామన్నారు మాజీ ఐఏఎస్‌ అధికారి గోపాల్‌ రావు. ఎన్నికల అధికారి, […]

Advertisement
Update:2019-04-16 11:55 IST

ఏపీ చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం‌, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదీ పై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు రిటైర్డ్‌ ఐఏఎస్‌ల బృందం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ బృందంలో ఐవైఆర్, అజయ్‌కల్లం, గోపాల్‌రావు తదితరులు ఉన్నారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదీ, ఎల్వీ సుబ్రహ్మణ్యం ల పై చంద్రబాబు నిందారోపణలు చేయడం సరికాదన్నారు. తమ నిరసనను గవర్నర్‌కు తెలిపామన్నారు మాజీ ఐఏఎస్‌ అధికారి గోపాల్‌ రావు.

ఎన్నికల అధికారి, చీఫ్‌ సెక్రటరీలపై బాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. రాజకీయ లబ్దికోసం అధికారులపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు.

మేం మా ఆత్మప్రభోదం ప్రకారమే పనిచేస్తామన్నారు గోపాల్‌ రావు. ఐఏఎస్‌ల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడాడని మండిపడ్డారు.
భవిష్యత్‌లో ఇలా జరగకుండా జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ని కోరామని చెప్పారు. చంద్రబాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదీని బెదిరించడం దారుణమన్నారు.
ఈ విషయం పై గవర్నర్‌ వద్ద మా నిరసనను తెలియజేశామన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఐఏఎస్‌లపై కేసులు మోపారన్నారు. అయితే ఎల్వీ సుబ్రహ్మణ్యం పై ఉమ్మడి హైకోర్టు కేసులు కొట్టివేసిందని… అయినా చంద్రబాబు నాయుడు ఎల్వీ సుబ్రహ్మణ్యం నిందితుడు అంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News