ఈవీఎంలపై బాబు నెపం.... టీడీపీ ఓడిపోతుందా?

టీడీపీ ఓడిపోతుందా.? బాబు ఎందుకిలా అంటున్నాడు.? ఈవీఎంలపై ఎందుకు నెపాన్ని నెడుతున్నాడు..? గెలుపుపై నమ్మకంగా చెప్పాల్సింది పోయి.. ఢిల్లీ వేదికగా ఈవీఎం అక్రమాలంటూ బాబు ఎందుకు నానా యాగీ చేస్తున్నాడనే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. బాబు ఇలాగే 2009లో కూడా ఓడిపోగానే పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ వల్లే తెలంగాణలో ఓడిపోయామని వాపోయాడు. అలాగే ఏపీలో చిరంజీవి పోటీ వల్ల కాపు ఓట్లు చీలి గెలవలేదని నెపాన్ని ప్రజారాజ్యంపై నెట్టాడు. 2014లో ఇదే ఈవీఎంలపై గెలవగానే తనదే క్రెడిట్ […]

Advertisement
Update:2019-04-14 10:33 IST

టీడీపీ ఓడిపోతుందా.? బాబు ఎందుకిలా అంటున్నాడు.? ఈవీఎంలపై ఎందుకు నెపాన్ని నెడుతున్నాడు..? గెలుపుపై నమ్మకంగా చెప్పాల్సింది పోయి.. ఢిల్లీ వేదికగా ఈవీఎం అక్రమాలంటూ బాబు ఎందుకు నానా యాగీ చేస్తున్నాడనే ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది.

బాబు ఇలాగే 2009లో కూడా ఓడిపోగానే పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ వల్లే తెలంగాణలో ఓడిపోయామని వాపోయాడు. అలాగే ఏపీలో చిరంజీవి పోటీ వల్ల కాపు ఓట్లు చీలి గెలవలేదని నెపాన్ని ప్రజారాజ్యంపై నెట్టాడు. 2014లో ఇదే ఈవీఎంలపై గెలవగానే తనదే క్రెడిట్ అన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం ఫలితాలు రాకముందే టీడీపీని ఆత్మరక్షణలో పెట్టేలా బాబు ప్రవర్తించడం తెలుగు తమ్ముళ్లలో ఆందోళనకు కారణమవుతోంది..

ఫలితాల్లో తేడా కొట్టేలా ఉందని బాబుకు క్లియర్ కట్ గా అర్థమైనందు వల్లే ఇలా ఈవీఎంలను బాబు బూచీగా చూపిస్తున్నాడా అన్న చర్చ టీడీపీలో సాగుతోంది. కొద్దిరోజులుగా టీడీపీ నేతల్లో భరోసానింపాల్సిన బాబు.. ఈవీఎంలపై నెపాన్ని నెట్టి ఓడిపోతున్నామన్న భావనను టీడీపీలో రేకెత్తిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మాటలు, చేష్టలు ఇప్పుడు టీడీపీ ఓటమి ఖాయమన్న అంచనాకు వచ్చేశారు.

బాబు ఎన్నికల అనంతరం ధీమాగా ఉండాల్సింది పోయి.. డీలా పడిపోవడంతో టీడీపీ శిబిరంలో ఆందోళనకు కారణమవుతోంది. మరి నిజంగానే టీడీపీ ఓడిపోతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News