నారాయణ, చైతన్య సిబ్బందికి ఎన్నికల డ్యూటీలేమిటి?
చంద్రబాబు ఎన్నికల కమిషన్ పై, ఈవీఎంలపై నిన్న చేసిన వ్యాఖ్యల పై మండిపడ్డారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి. చంద్రబాబుకు ఏమైందో తెలియదని…. పోలింగ్‌కు ఒక రోజు ముందే పెద్ద డ్రామాకు తెర లేపారన్నారు ఆయన. ఓడిపోతున్నామని చంద్రబాబుకు ముందే తెలిసి…. సానుభూతి కోసమే ఈసీ కార్యాలయం వద్ద చంద్రబాబు బైఠాయించారన్నారు. 2014లో కూడా ఇవే ఈవీఎంలు ఉన్నాయని…. అప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చారని… అంటే అప్పుడు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయా? అని ప్రశ్నించారు సజ్జల. […]
చంద్రబాబు ఎన్నికల కమిషన్ పై, ఈవీఎంలపై నిన్న చేసిన వ్యాఖ్యల పై మండిపడ్డారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి.
చంద్రబాబుకు ఏమైందో తెలియదని…. పోలింగ్‌కు ఒక రోజు ముందే పెద్ద డ్రామాకు తెర లేపారన్నారు ఆయన. ఓడిపోతున్నామని చంద్రబాబుకు ముందే తెలిసి…. సానుభూతి కోసమే ఈసీ కార్యాలయం వద్ద చంద్రబాబు బైఠాయించారన్నారు.
2014లో కూడా ఇవే ఈవీఎంలు ఉన్నాయని…. అప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చారని… అంటే అప్పుడు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయా? అని ప్రశ్నించారు సజ్జల.
2014 ఫలితాలను వైఎస్ జగన్ హుందాగా స్వీకరించారని గుర్తుచేశారు. 70 ఏళ్ళ చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నారో అందరూ చూస్తున్నారు. ఒక గుర్తుకు ఓటేస్తే మరో గుర్తుకు వెళ్తోందని చంద్రబాబు అంటున్నారని, చంద్రబాబు మానసిక స్థితిని వైద్యులే చెప్పాలన్నారు. 80 శాతం పైగా పోలింగ్ జరిగిందని, చంద్రబాబు కుటుంబం సహా ఓటు వేసిన వారెవరూ ఫిర్యాదు చేయలేదని, ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఆ అనుమానాలు వస్తున్నాయని మండిపడ్డారు సజ్జల రామకృష్ణా రెడ్డి.
అసలు చంద్రబాబు ఓటు దేనికి వేశారు? సైకిల్ గుర్తుకా? ఫ్యాన్ గుర్తుకా? అని ప్రశ్నించారు. ఫలితాలు ముందే తెలిసి చంద్రబాబు డ్రామాలాడుతున్నారు సజ్జల. ఎన్టీఆర్ తెలుగు జాతి కోసం పోరాడితే…. చంద్రబాబు మాత్రం తెలుగువారి పరువు తీస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి ప్రజలకు సంబంధించినది కాదని… మీ సొంత పనుల కోసం, పార్టీ పనులకోసం పెట్టుకున్నారని…. ఆయన్ను తప్పించడం వల్ల జరిగే నష్టమేమీ లేదన్నారు. సీఎస్, మరో ముగ్గురు ఎస్పీలను బదిలీ చేశారని, మిగిలిన అధికారులంతా ఐదేళ్ళుగా మీ ప్రభుత్వంలో ఉన్నవారేనని చంద్రబాబుకు గుర్తుచేశారు. అందరూ మీ గులాముల్లాగా పనిచేసేవారు లేరనేది చంద్రబాబుకు బాధ అని, ప్రభుత్వ ఉద్యోగులు లక్షల మంది ఉన్నా…. ఎలక్షన్ డ్యూటీకి చైతన్య, నారాయణ కాలేజీ సిబ్బందిని ఎందుకు వాడారని ప్రశ్నించారు.
ఓటర్లకు నీళ్ళు, బిస్కెట్లు రాలేదని లోకేష్ ఆరోపిస్తున్నారని, ఆ బాధ్యత ప్రభుత్వంలో ఉన్న మీది కాదా? అని ప్రశ్నించారు సజ్జల. ఈవీఎంలు పనిచేయకపోవడం కూడా మీ వైఫల్యమే అని మండిపడ్డారు.
ఏపీ డీజీపీ ఆఫీసుకు సీఎస్ వెళ్ళడం తప్పుకాదని…. సీఎం హోదాలో ఉండి ఈసీ ఆఫీసుకు చంద్రబాబు వెళ్ళడమే వింత అని అన్నారు సజ్జల. ఏపీ సీఎస్ పై చంద్రబాబు సంకుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఏపీ సీఎస్‌పై చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ తరపున ఖండిస్తున్నామన్నారు.
కోడెల వ్యవహారం పై కూడా స్పందించారు సజ్జల. కోడెల ఓడిపోతున్నానే భయంతోనే కావాలని సింపతీ కోసం కొట్టినట్లుగా డ్రామాలాడారని మండిపడ్డారు.
ఈ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయాత్మక తీర్పు ఇచ్చారని మేం భావిస్తున్నామన్నారు సజ్జల.