తాడేపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆర్కే ధర్నా
వైసీపీ కార్యకర్తలపై అక్రమంగా తప్పుడు కేసులు పెట్టడం పై ఆగ్రహించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తాడేపల్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. టీడీపీ నేతలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేసి…. తిరిగి వైసీపీ కార్యకర్తలపైనే కేసులు పెట్టడం ఏమిటని మండిపడ్డారు ఆర్కే. ఈ ధర్నాకు పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తాడేపల్లి పీఎస్‌కు తరలి వచ్చారు. చంద్రబాబు, లోకేష్ ఒత్తిడితోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు ఆయన. మాపై దాడు […]
వైసీపీ కార్యకర్తలపై అక్రమంగా తప్పుడు కేసులు పెట్టడం పై ఆగ్రహించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తాడేపల్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.
టీడీపీ నేతలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేసి…. తిరిగి వైసీపీ కార్యకర్తలపైనే కేసులు పెట్టడం ఏమిటని మండిపడ్డారు ఆర్కే. ఈ ధర్నాకు పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తాడేపల్లి పీఎస్‌కు తరలి వచ్చారు.
చంద్రబాబు, లోకేష్ ఒత్తిడితోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు ఆయన. మాపై దాడు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని, కానీ దాడులు చేసి తిరిగి దెబ్బలు తిన్నవారిపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని పోలీసుల తీరు పై మండిపడ్డారు.
తమ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని, అలాగే తాము చేసే ఫిర్యాదులను కూడా పరిగణనలోకి తీసుకుని కేసులు నమోదు చేయాలని కోరారు. ప్రతిపక్షాలకు ఒక రూలు, అధికార పార్టీకి మరో రూలా? అని ఆయన ప్రశ్నించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరసన విరమించేది లేదని ఆయన పట్టుపట్టారు.
చంద్రబాబు, లోకేష్ మాటలు విని పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని… దీనికి నిరసనగానే ధర్నాకు దిగామన్నారు ఆర్కే.