తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుందా ?

నాలుగు నెలల క్రితం జరిగిన తెలంగాణ శాసనసభ ముందస్తు ఎన్నికలలో మహా కూటమి విజయం సాధిస్తుందని ప్రచారం చేశారు. ఈ కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ వారే కాదు… కొందరు విశ్వసించారు. ఎన్నికలకు చివరి రెండు రోజుల ముందు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మొత్తం పరిస్థితిని తారుమారు చేసే సారు. ఆ ఎన్నికలలో 88 స్థానాలను గెలుచుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది తెలంగాణ రాష్ట్ర […]

Advertisement
Update:2019-04-12 04:40 IST

నాలుగు నెలల క్రితం జరిగిన తెలంగాణ శాసనసభ ముందస్తు ఎన్నికలలో మహా కూటమి విజయం సాధిస్తుందని ప్రచారం చేశారు. ఈ కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ వారే కాదు… కొందరు విశ్వసించారు.

ఎన్నికలకు చివరి రెండు రోజుల ముందు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మొత్తం పరిస్థితిని తారుమారు చేసే సారు. ఆ ఎన్నికలలో 88 స్థానాలను గెలుచుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది తెలంగాణ రాష్ట్ర సమితి.

ఆ తర్వాత పరిణామాలలో కాంగ్రెస్ నుంచి గెలిచిన పదిమంది శాసనసభ్యులు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరిపోయారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో మనుగడ కోల్పోయినట్లేనని అందరూ భావించారు. లోక్ సభ ఎన్నికలు రావడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఊపిరి తీసుకోవడం ప్రారంభమైంది.

ఎప్పటిలాగే అభ్యర్థుల ఎంపికలోనూ, ప్రచారంలోనూ పార్టీ గ్రూపు కుమ్ములాటలు బయటపడ్డాయి. దీంతో ఈ పార్టీ ఇక పూర్తిస్థాయిలో మునిగిపోయినట్లేనని తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగు ప్రజలు కూడా భావించారు. అయితే లోక్ సభ ఎన్నికలు జరిగిన తీరు చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఊపిరి ఉన్నట్లుగానే భావించాల్సి వస్తోందంటున్నారు.

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కనీసం నాలుగు స్థానాలు దక్కుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటు వేసిన యువత, మహిళలు ఈసారి లోక్ సభ ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ కు ఓటు వేయాలని నిర్ధారణకు వచ్చినట్లుగా చెబుతున్నారు.

తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు జరిగిన ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చేవెళ్ల, మల్కాజిగిరి, మహబూబాబాద్, ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుందని చెబుతున్నారు.

ఈ స్థానాలతో పాటు మరో రెండు మూడు స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చిందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల వ్యతిరేకత ప్రారంభమైంది అనడానికి ఈ లోక్ సభ ఎన్నికలు నిదర్శనం కానున్నాయని చెబుతున్నారు. ఏమో తెలంగాణలో కాంగ్రెస్ గుర్రం ఎగరావచ్చు అని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News