చంద్రబాబనే రాక్షసుడు ఉన్నాడు కాబట్టే ఈ సమస్యలు : వైఎస్ జగన్
ఏపీలో ఇవాళ జరిగిన పోలింగ్ సమయంలో తలెత్కిన సమస్యలకు చంద్రబాబే కారణమని వైసీపీ అధినేత జగన్ అన్నారు. చంద్రబాబనే రాక్షసుడు సృష్టించిన అడ్డంకుల వల్లే ఇలాంటి పరిస్థితి దాపురించిందని ఆయన దుయ్యబట్టారు. పోలింగ్ ముగిసిన అనంతరం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని చంద్రబాబుకు తెలిసిపోయిందని.. ఒక సీఎం అయ్యుండి ఎన్నికల సంఘాన్ని బెదిరించడం దారుణమని అన్నారు. పెద్ద ఎత్తున పోలింగ్ నమోదు కావొద్దనే దురుద్దేశంతోనే బాబు ఈవీఎంలు పని చేయట్లేదనే […]
ఏపీలో ఇవాళ జరిగిన పోలింగ్ సమయంలో తలెత్కిన సమస్యలకు చంద్రబాబే కారణమని వైసీపీ అధినేత జగన్ అన్నారు. చంద్రబాబనే రాక్షసుడు సృష్టించిన అడ్డంకుల వల్లే ఇలాంటి పరిస్థితి దాపురించిందని ఆయన దుయ్యబట్టారు. పోలింగ్ ముగిసిన అనంతరం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని చంద్రబాబుకు తెలిసిపోయిందని.. ఒక సీఎం అయ్యుండి ఎన్నికల సంఘాన్ని బెదిరించడం దారుణమని అన్నారు. పెద్ద ఎత్తున పోలింగ్ నమోదు కావొద్దనే దురుద్దేశంతోనే బాబు ఈవీఎంలు పని చేయట్లేదనే పుకార్లు పుట్టించారని ఆయన అన్నారు. ఓట్ల శాతం తగ్గితే తనకు కలసి వస్తుందనే స్థాయికి బాబు దిగజారాడని జగన్ విమర్శించారు.
ఈవీఎంలలో ఒక పార్టీకి వేస్తే మరో పార్టీకి ఓట్లు పడుతున్నాయని అనడం అబద్దమని జగన్ చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీవీ ప్యాట్లు ఉన్నాయి. మనం వేసే ఓటు ఎవరికి పడుతుందో కూడా చూసుకోవచ్చు. నేను కూడా ఓటేసి చూసుకున్నాను. అంతా సక్రమంగానే ఉందని జగన్ అన్నారు.
ఏపీలో సాయంత్రానికి 80 శాతం పోలింగ్ జరిగింది.. పూర్తి స్థాయిలో పోలింగ్ ముగిసిన తర్వాత 85 శాతం వరకు ఓటింగ్ జరుగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారు.. రీపోలింగ్ చేయాలని అడగడం అంటే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకున్నట్లు తెలిసిపోతుందని ఆయన స్పష్టం చేశారు. ఇవి కేవలం బాబు ఓటమి కోసం వెతుక్కుంటున్న కారణాలు మాత్రమే అని ఆయన చెప్పారు.
ఓటింగ్ శాతం భారీగా పెరగడం మాకు సానుకూలమైన సంకేతమని జగన్ అభిప్రాయపడ్డారు. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని విలేకరులు ప్రశ్నించగా.. భారీ మెజార్టీతో గెలువబోతున్నామని జగన్ ధీమా వ్యక్తం చేశారు.
ఇక, ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసిన ప్రతీ ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తమ పార్టీ తరపున నిలబడ్డ అభ్యర్థులకు, వారికోసం పని చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
రిటర్న్ గిఫ్ట్ ఏంటీ..?
బాబుకు మీరు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారా అని అడుగగా.. రిటర్న్ గిఫ్ట్ అంటే ఏంటని జగన్ ప్రశ్నించారు. కేసీఆర్ ఇస్తానన్న గిఫ్ట్ అని గుర్తు చేయగా.. అది బాబు, కేసీఆర్‌నే అడగాలన్నారు. వేరే ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్లట్లేదని ఈ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తానని జగన్ ప్రెస్ మీట్ ముగించారు.