రోహిత్.... చేజారిన ఐపీఎల్ మ్యాచ్ ల రికార్డు

వరుసగా 133 మ్యాచ్ లు ఆడిన రోహిత్ సురేశ్ రైనా 134 మ్యాచ్ లతో రికార్డు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ…గాయంతో ఓ అరుదైన రికార్డు ను చేజార్చుకొన్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఏకబిగిన 134 మ్యాచ్ లు ఆడిన సురేశ్ రైనా రికార్డును అధిగమించడం లో విఫలమయ్యాడు. భుజం గాయంతో..కింగ్స్ పంజాబ్ తో జరిగిన ఆరో రౌండ్ మ్యాచ్ కు రోహిత్ దూరం కావడం తో..133 వరుస మ్యాచ్ ల తర్వాత బ్రేక్ పడింది. సురేశ్ […]

Advertisement
Update:2019-04-11 13:45 IST
  • వరుసగా 133 మ్యాచ్ లు ఆడిన రోహిత్
  • సురేశ్ రైనా 134 మ్యాచ్ లతో రికార్డు

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ…గాయంతో ఓ అరుదైన రికార్డు ను చేజార్చుకొన్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఏకబిగిన 134 మ్యాచ్ లు ఆడిన సురేశ్ రైనా రికార్డును అధిగమించడం లో విఫలమయ్యాడు.

భుజం గాయంతో..కింగ్స్ పంజాబ్ తో జరిగిన ఆరో రౌండ్ మ్యాచ్ కు రోహిత్ దూరం కావడం తో..133 వరుస మ్యాచ్ ల తర్వాత బ్రేక్ పడింది.

సురేశ్ రైనా 2008 నుంచి 2019 వరకూ…ఎలాంటి బ్రేక్ లేకుండా ఏకబిగిన 134 మ్యాచ్ లు ఆడటం ద్వారా..తన పేరుతో ఓ అరుదైన రికార్డును లిఖించుకొన్నాడు. అయితే…ఆ రికార్డును అధిగమించే అవకాశం రోహిత్ శర్మకు వచ్చినా…గాయంతో ఆటకు దూరం కావాల్సి వచ్చింది.

విరాట్ కొహ్లీ 129, మహేంద్ర సింగ్ ధోనీ 119 మ్యాచ్ లు, గౌతం గంభీర్ 108 వరుస మ్యాచ్ లతో ఉన్నారు.

ఐపీఎల్ -12లో నాలుగో సెంచరీ…

ఐపీఎల్ 2019 సీజన్ మొదటి ఆరురౌండ్ల మ్యాచ్ ల్లోనే…నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన పోటీలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సంజు శాంసన్ 102 పరుగుల నాటౌట్ స్కోరుతో సీజన్ తొలి శతకాన్ని నమోదుచేస్తే… రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు జానీ బెయిర్ స్టో 114, డేవిడ్ వార్నర్ 100 పరుగుల నాటౌట్ స్కోర్లతో జంట సెంచరీలు సాధించారు.

ముంబై ఇండియన్స్ తో ముగిసిన ఆరోరౌండ్ పోటీలో కింగ్స్ పంజాబ్ఓపెనర్ కెెఎల్ రాహుల్ 100 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచాడు. రాహుల్ ఐపీఎల్ కెరియర్ లో ఇదే మొదటి మూడంకెల స్కోరు కావడం విశేషం. మొదటి ఆరురౌండ్లలోనే నాలుగు శతకాలు నమోదైతే…మిగిలిన ఎనిమిది రౌండ్ల మ్యాచ్ ల్లో మరెన్ని సెంచరీలు సాధిస్తారో మరి.

Tags:    
Advertisement

Similar News