చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఓల్డ్ ఈజ్ గోల్డ్
ఐపీఎల్ 12వ సీజన్లో టేబుల్ టాపర్ గా చెన్నై చెన్నై సీనియర్ స్టార్ల సూపర్ షో ఇరవై ఓవర్లు…అరవై థ్రిల్స్ తో సాగిపోయే ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ అంటే కుర్రాళ్ల ఆట అనుకొనే రోజులు పోయాయి. ఐపీఎల్ 12వ సీజన్లో..డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన విజయాలలో… సీనియర్ స్టార్లలో మహేంద్ర సింగ్ ధోనీ, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహీర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఓల్జ్ ఈజ్ గోల్డ్ అనిపించుకొంటున్నారు. కోల్ కతా నైట్ రైడర్స్ […]
- ఐపీఎల్ 12వ సీజన్లో టేబుల్ టాపర్ గా చెన్నై
- చెన్నై సీనియర్ స్టార్ల సూపర్ షో
ఇరవై ఓవర్లు…అరవై థ్రిల్స్ తో సాగిపోయే ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ అంటే కుర్రాళ్ల ఆట అనుకొనే రోజులు పోయాయి. ఐపీఎల్ 12వ సీజన్లో..డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన విజయాలలో… సీనియర్ స్టార్లలో మహేంద్ర సింగ్ ధోనీ, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహీర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఓల్జ్ ఈజ్ గోల్డ్ అనిపించుకొంటున్నారు.
చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ముగిసిన ఈ మ్యాచ్ లో పవర్ ఫుల్ కోల్ కతా నైట్ రైడర్స్ ను…చెన్నై జట్టు కేవలం108 పరుగులకే పరిమితం చేసి…కీలక విజయం సొంతం చేసుకొంది.
చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 37ఏళ్ల వయసులో తనజట్టుకు నాయకత్వంతో పాటు….వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా సేవలు అందిస్తుంటే…38 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, 40 ఏళ్ల లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ స్పిన్ జోడీగా కీలకపాత్ర పోషిస్తున్నారు.
హర్భజన్ 4 ఓవర్లలో 15 పరుగులిచ్చి 2 వికెట్లు, తాహీర్ 21 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టడం ద్వారా కోల్ కతా నైట్ రైడర్స్ కు పగ్గాలు వేయగలిగారు.
చెన్నై టాప్ గేర్….
ఐపీఎల్ 12వ సీజన్ మొదటి ఆరురౌండ్ల మ్యాచ్ లు ముగిసే సమయానికి…చెన్నై సూపర్ కింగ్స్…5 విజయాలు, ఓ పరాజయంతో 10 పాయింట్లు సాధించడం ద్వారా… టేబుల్ టాపర్ గా నిలిచింది.
కోల్ కతా నైట్ రైడర్స్, కింగ్స్ పంజాబ్ చెరో ఎనిమిది పాయింట్లు సాధించడం ద్వారా రెండు, మూడుస్థానాలలో కొనసాగుతున్నాయి.
ఆరు రౌండ్లలో మూడు విజయాలు, మూడు పరాజయాలతో… 6 పాయింట్లు సాధించడం ద్వారా హైదరాబాద్ సన్ రైజర్స్ నాలుగో స్థానంలో నిలిచింది.
ముంబై ఇండియన్స్ ఐదు, ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు ,రాజస్థాన్ రాయల్స్ ఏడు, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఎనిమిది స్థానాలలో ఉన్నాయి.
ఆరుకు ఆరురౌండ్లలోనూ ఓడిన ఏకైకజట్టు గా విరాట్ కొహ్లీ నాయకత్వంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ నిలిచింది.