ప్రలోభాలు పని చేస్తాయా బాబూ...!

“ఎంత అడిగితే అంత ఇవ్వండి. ఎవరు ఏది అడిగితే అది ఇవ్వండి. పోల్ మేనేజ్ మెంట్లో ఎక్కడా తేడా రాకూడదు” ఇవి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల మాటలు. ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజక వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు తెలుగుదేశం నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావంటున్నారు. ఎక్కడికక్కడ నోట్ల కట్టలు పంచడంతోపాటు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు అని స్థానికులు చెబుతున్నారు. ఏం చేసైనా… ఎలా చేసైనా ఈసారి గెలవాలన్నది తెలుగుదేశం పార్టీ అంతిమ […]

Advertisement
Update:2019-04-11 02:48 IST

“ఎంత అడిగితే అంత ఇవ్వండి. ఎవరు ఏది అడిగితే అది ఇవ్వండి. పోల్ మేనేజ్ మెంట్లో ఎక్కడా తేడా రాకూడదు” ఇవి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల మాటలు. ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజక వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు తెలుగుదేశం నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావంటున్నారు. ఎక్కడికక్కడ నోట్ల కట్టలు పంచడంతోపాటు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు అని స్థానికులు చెబుతున్నారు.

ఏం చేసైనా… ఎలా చేసైనా ఈసారి గెలవాలన్నది తెలుగుదేశం పార్టీ అంతిమ లక్ష్యంగా మారిందంటున్నారు. దీంతో ఎక్కడికక్కడ బూత్ వారీగాను, గ్రామాల వారీగాను, కాలనీలు, వార్డులలో డబ్బులు వెదజల్లాలని, మద్యం పంచాలని తెలుగు తమ్ముళ్లు నిర్ణయించినట్టుగా చెబుతున్నారు.

ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు, సానుభూతిపరులతో చాపకింద నీరులా డబ్బు, మద్యం పంపిణీ చేశారని స్థానికులు అంటున్నారు. అయితే ఇంత చేసినా తెలుగుదేశం పార్టీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పోతుందా? అనే అనుమానం కూడా పార్టీ సీనియర్ నాయకులను వెంటాడుతోంది.

ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లోను బుధవారం రాత్రి ప్రలోభాలకు తెర లేచింది. ఓటుకు అధికార పక్షం రెండు వేల రూపాయలకు పైగానే చెల్లించినట్లు చెబుతున్నారు. కొన్ని చోట్ల అయితే ఐదు వేలు, ఎనిమిది వేల రూపాయల వరకూ చెల్లించినట్లుగా చెబుతున్నారు.

విజయమే లక్ష్యంగా దేనికైనా సిద్ధపడాలని తెలుగు తమ్ముళ్లకు అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే, రాత్రికి రాత్రి డబ్బు, మద్యం పంచినా…. ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినా ఓటరు మనసులో ఏముందో తెలియడం అంత సులభం కాదని అంటున్నారు.

రాష్ట్ర్రంలో మార్పు కావాలని కోరుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉందని, అలాంటి వారు ఎలాంటి ప్రలోభాలకూ గురి అయ్యే అవకాశాలు ఉండవని చెబుతున్నారు. ఈసారి ఎలాంటి ప్రలోభాలకు గురి చేయాలనుకున్నా దాని ప్రభావం మాత్రం ఓటర్ పై ఉండే అవకాశం తక్కువేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News