గొడవలు జరపడానికి చంద్రబాబు కుట్రచేస్తున్నాడు.... వైసీపీ ఫిర్యాదు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని కలిసి ఒక లేఖను అందజేశారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకోవాలని సీఈవో ద్వివేదిని కోరామన్నారు వైసీపీనేతలు. తరువాత మీడియాతో మాట్లాడిన వైసీపీనేత నాగిరెడ్డి…. ఎన్నికలకు కొన్ని గంటల ముందు చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపారన్నారు. చంద్రబాబు ఆఖరి ప్రయత్నంగా చేస్తున్న కుట్రలను ఎలక్షన్ కమిషన్ అడ్డుకోవాలని కోరారు. పోలింగ్ దగ్గరపడే కొద్ది చంద్రబాబు మరిన్ని కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని లేఖలో తెలిపామన్నారు. […]
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని కలిసి ఒక లేఖను అందజేశారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకోవాలని సీఈవో ద్వివేదిని కోరామన్నారు వైసీపీనేతలు.
తరువాత మీడియాతో మాట్లాడిన వైసీపీనేత నాగిరెడ్డి…. ఎన్నికలకు కొన్ని గంటల ముందు చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపారన్నారు. చంద్రబాబు ఆఖరి ప్రయత్నంగా చేస్తున్న కుట్రలను ఎలక్షన్ కమిషన్ అడ్డుకోవాలని కోరారు. పోలింగ్ దగ్గరపడే కొద్ది చంద్రబాబు మరిన్ని కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని లేఖలో తెలిపామన్నారు.
ఓటర్ తన ఓటు హక్కును స్వేచ్ఛగా వేసేందుకు లేకుండా… కుట్రలు పన్నుతున్నట్లు మీడియాకు ఇచ్చిన లీకుల ద్వారా తెలుస్తోందన్నారు వైసీపీ నేత నాగిరెడ్డి. ఓటర్ నిర్భయంగా ఓటు వేసేందుకు ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటే చంద్రబాబుకు వచ్చిన అభ్యంతరమేంటి అని ప్రశ్నించారు.
మే 23న వచ్చే ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. సీఎం ధర్నా నిర్వహించడం విడ్డూరమని,
చంద్రబాబు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు వైసీపీ నేత నాగిరెడ్డి.
ఈ విషయాలను ప్రజలు గమనిస్తున్నారని, ఆఖరి నిమిషంలో చంద్రబాబు గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి ఎలాంటి ప్రమాదం ఏర్పడిందో చంద్రబాబు చెప్పాలన్నారు.
చంద్రబాబు ఆపద్ధర్మ సీఎం మాత్రమేనని, ముఖ్యమంత్రి స్థాయిలో కాకుండా ఒక పార్టీ అధ్యక్షుడి స్థాయిలో ఈసీకి ఫిర్యాదు చేస్తే బాగుండేదన్నారు. టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికల్లో పాల్గొనాలని సూచించారు. నిన్న సాయంత్రం ఆరు గంటల తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కాదా అని చంద్రబాబును ప్రశ్నించారు.