మాపై ఎవరి ఒత్తిడీ లేదు : ద్వివేది

ఎన్నికల సంఘం రాజ్యాంగం ద్వారా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని.. ఇలాంటి సంస్థపై ఎవరి ఒత్తిడీ పని చేయదని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికంగా పని చేస్తున్నామని.. మాపై ఎలాంటి ఒత్తిడులు పని చేయవని ఆయన చెప్పారు. ఒక రాష్ట్ర సీఎంగా చంద్రబాబు అంటే మాకు గౌరవం ఉందని.. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే ఆదేశాలను అమలు చేయాల్సిన […]

Advertisement
Update:2019-04-10 16:12 IST

ఎన్నికల సంఘం రాజ్యాంగం ద్వారా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని.. ఇలాంటి సంస్థపై ఎవరి ఒత్తిడీ పని చేయదని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికంగా పని చేస్తున్నామని.. మాపై ఎలాంటి ఒత్తిడులు పని చేయవని ఆయన చెప్పారు.

ఒక రాష్ట్ర సీఎంగా చంద్రబాబు అంటే మాకు గౌరవం ఉందని.. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ద్వివేది చెప్పారు. ఒక పార్టీకి అనుకూలంగా పని చేయాల్సిన అవసరం ఎన్నికల సంఘానికి లేదని ఆయన స్పష్టం చేశారు.

ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ సీఎం చంద్రబాబు సచివాలయంలోని సీఈవో కార్యాలయంలో ద్వివేదీకి వినతిపత్రం అందించారు. అనంతరం ఈసీ తీరుకు నిరసనగా కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపిన నేపథ్యంలో ద్వివేది పై విధంగా స్పందించారు.

Tags:    
Advertisement

Similar News