ఫ్యానుకు కాపుల మద్దతు ఖాయం!

ఆంధ్రప్రదేశ్ లో కాపుల మద్దతు ఎవరికో తేలిపోయింది. సినీ హీరో పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ జనసేనకు మద్దతు పలుకుతారు అనుకున్న కాపులు అనూహ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గతంలో తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు పలికిన కాపులు ఇక చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితి లేదని కుల సంఘం సమావేశంలో చెబుతున్నట్లు సమాచారం. కాపు రిజర్వేషన్ లపై 15 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నా ఎన్నికల సమయంలో మాత్రమే […]

Advertisement
Update:2019-04-10 02:44 IST

ఆంధ్రప్రదేశ్ లో కాపుల మద్దతు ఎవరికో తేలిపోయింది. సినీ హీరో పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ జనసేనకు మద్దతు పలుకుతారు అనుకున్న కాపులు అనూహ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

గతంలో తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు పలికిన కాపులు ఇక చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితి లేదని కుల సంఘం సమావేశంలో చెబుతున్నట్లు సమాచారం. కాపు రిజర్వేషన్ లపై 15 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నా ఎన్నికల సమయంలో మాత్రమే తమను ఓటర్లుగా పరిగణిస్తున్న చంద్రబాబు నాయుడికి ఈసారి మద్దతు పలక రాదంటూ కాపుల్లో మెజారిటీ వర్గం భావిస్తున్నట్లు చెబుతున్నారు.

కాపుల్లో కొంతమందికి టిక్కెట్లు ఇచ్చి… ఇంకొంత మందికి వివిధ రకాల ప్రయోజనాలు చేకూర్చి మొత్తం కాపు జాతిని అంతా తన వైపు తిప్పుకోవాలన్నది చంద్రబాబు నాయుడు వ్యూహంలా ఉందని కాపుల్లో మెజారిటీ వర్గం అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన జనసేనకు మద్దతు తెలుపుదామంటే…. ఆ పార్టీకి గతంలో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీకి పట్టిన గతే ఇప్పుడు జనసేనకు కూడా పడుతుందనే అనుమానం కాపు పెద్దల్లో నెలకొందని సమాచారం. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా జనసేన ఉంటుందని భావించిన కాపు నాయకులకు ఇటీవల పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రసంగాలు చూస్తే… భవిష్యత్ లో చంద్రబాబుకు మద్దతు పలికే అవకాశం ఉన్నట్లు గా భావిస్తున్నారని చెబుతున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కాపులకు న్యాయం చేసేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని కాపుల్లో మెజారిటీ వర్గం నిర్ణయించినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం కల్పించి కాపులకు ఉపయోగపడే పనులు చేసేలా చూసుకోవాలని కాపు నాయకులు నిర్ణయించినట్లు సమాచారం.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లోనూ ఉన్న కాపు సంఘాల నాయకులకు వర్తమానం పంపినట్లు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాపులు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

Tags:    
Advertisement

Similar News