ఏపీలో ప్రలోభాల ఖర్చు పదివేల కోట్లు?

ఏపీలో ఎన్నికల పోలింగ్ కు ఒకేరోజు మిగిలింది. దీంతో ప్రలోభాల పర్వం జోరందుకుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఓటుకు నోటు జోరుగా సాగుతోంది. మద్యం ఏరులై పారుతోంది. టైట్ ఫైట్ ఉన్న నియోజక వర్గాల్లో ఓటుకు రెండు నుంచి మూడు వేలు కూడా ఇస్తున్నట్లు టాక్. కృష్టా,గుంటూరు జిల్లాల్లో కూడా ఇదే రీతిలో డబ్బు పంపకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం మంత్రుల నియోజకవర్గాల్లో ఓటుకు 5 వేలు దాకా ఇస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇంకో టాక్ కూడా […]

Advertisement
Update:2019-04-10 06:03 IST

ఏపీలో ఎన్నికల పోలింగ్ కు ఒకేరోజు మిగిలింది. దీంతో ప్రలోభాల పర్వం జోరందుకుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఓటుకు నోటు జోరుగా సాగుతోంది. మద్యం ఏరులై పారుతోంది. టైట్ ఫైట్ ఉన్న నియోజక వర్గాల్లో ఓటుకు రెండు నుంచి మూడు వేలు కూడా ఇస్తున్నట్లు టాక్. కృష్టా,గుంటూరు జిల్లాల్లో కూడా ఇదే రీతిలో డబ్బు పంపకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం మంత్రుల నియోజకవర్గాల్లో ఓటుకు 5 వేలు దాకా ఇస్తున్నట్లు సమాచారం.

మరోవైపు ఇంకో టాక్ కూడా విన్పిస్తోంది. రాజకీయ నేతలు లోకల్ గా కొన్ని గ్రామాల్లో డబ్బులు పంపిణీ ప్రారంభించలేదు. అయితే ఇక్కడ ప్రజలు ముందుగానే ఓటుకు వెయ్యి, రెండు వేలు ఇస్తున్నారని ప్రచారం చేస్తున్నారట. ఈ విషయం తెలిసిన నేతలే తమకంటే ప్రజలు తెలివి మీరారని జోకులు వేసుకుంటున్నారు. డబ్బులతో పాటు బంగారం ముక్కుపుడకలు, వెండి పూజా సామాగ్రి, కుంకుమ భరిణాలు మహిళలకు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి రాజకీయ నేతల ధాటికి నెల్లూరు బంగారు దుకాణాల్లో వెండి మొత్తం అయిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. గత వారం రోజుల్లో 100 కోట్ల రూపాయల వెండి అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

గోదావరి జిల్లాల్లో చీరలతో పాటు ఇతర ఫ్యాన్సీ ఐటెమ్ లు మహిళలకు అందజేస్తున్నారట. మొత్తానికి రిజర్వ్ డ్ నియోజకవర్గాల్లో ఓటుకు ఐదువందలు నడుస్తుంటే… టైట్ ఫైట్ ఉన్న చోట రెండు నుంచి మూడు వేలు… అక్కడి నుంచి ఐదు వేల వరకు చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నగదు పంపిణీ కూడా విడతల వారీగా చేయడం మరో ఆసక్తికరం అంశం.

మొత్తానికి ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఆంగ్ల పత్రిక అంచనా ప్రకారం ప్రలోభాల పర్వం పదివేల కోట్లకు చేరుకుందని తెలుస్తోంది. నగదు పంపిణీ, మద్యం, ఇతర ప్రలోభాలు ఇలా ఉంటే…. ఇక పార్టీల ప్రచారం ఖర్చు తడిసిమోపెడు అవుతోంది. దీంతో ఈ సారి ఏపీ ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరిగింది.

Tags:    
Advertisement

Similar News