కుప్పంలోనూ జగన్‌కు బ్రహ్మరథం

వైఎస్ జగన్ ప్రభంజనం రాష్ట్రమంతా ఎలా ఉందో ఇప్పటికే అర్థమవుతోంది. పాదయాత్ర తర్వాత ఎన్నికల ప్రచారంలో పలు ప్రాంతాలను జగన్ మెరుపు వేగంతో చుట్టివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం కూడా వెళ్లారు. గత 30 ఏళ్లుగా చంద్రబాబే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కాలమంతా సీఎంగా, ప్రతిపక్ష నాయకుడిగా, మంత్రిగా పని చేశారు. అలాంటి కుప్పంలో అనూహ్యంగా జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఆశ్చర్యం […]

Advertisement
Update:2019-04-08 10:05 IST

వైఎస్ జగన్ ప్రభంజనం రాష్ట్రమంతా ఎలా ఉందో ఇప్పటికే అర్థమవుతోంది. పాదయాత్ర తర్వాత ఎన్నికల ప్రచారంలో పలు ప్రాంతాలను జగన్ మెరుపు వేగంతో చుట్టివస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం కూడా వెళ్లారు. గత 30 ఏళ్లుగా చంద్రబాబే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కాలమంతా సీఎంగా, ప్రతిపక్ష నాయకుడిగా, మంత్రిగా పని చేశారు. అలాంటి కుప్పంలో అనూహ్యంగా జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఆశ్చర్యం కలిగించింది.

ఏదో ఒక రాజకీయ నాయకుడిని చూద్దాం, పాపులారిటీ కలిగిన యువ నాయకుడి మాటలు విందాం అనే తీరుగా వచ్చినట్లు కనిపించలేదు ఆ జనం. వైఎస్ జగన్ అభివాదం చేసిన దగ్గర మొదలు…. మైకు పట్టి ప్రసంగించి…. చివరకు అభినందనలు తెలిపే వరకు ఒకటే కేరింతలు.

పైగా జై జగన్.. కాబోయే సీఎం జగన్ అని అరుపులు విని వైసీపీ నేతలే ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. స్వయంగా సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే జగన్‌ను కాబోయే సీఎం అంటూ నినదించడం అక్కడ ప్రజల ట్రెండ్ ఎటువైపు ఉందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు కుప్పంలో ఈ సంఘటన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ మరింత అప్రమత్తమైంది. మరో 48 గంటల్లో ప్రచారం కూడా ముగియనుండటంతో ఏకంగా భువనేశ్వరి రంగంలోకి దిగినట్లు సమాచారం.

Tags:    
Advertisement

Similar News