కులం కత్తి తీసిన మాజీ జేడీ
కులాలకు మతాలకు అతీతం అని చెప్పుకున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల బరిలో దిగే సరికి కులం కత్తి తీశారు. రహస్యంగా కుల సమావేశాలు ఏర్పాటు చేసి నేను మీవాడిని, మీ ప్రతినిధిని అంటూ కులం కార్డు విసురుతున్నారు. వాల్తేరు క్లబ్‌లో నాలుగు రోజుల క్రితం 350 మంది కాపు నేతలతో మాజీ జేడీ రహస్యంగా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో నేను మీ ప్రతినిధిగా పోటీ చేస్తున్నా… కాబట్టి సొంత వ్యక్తికి అవకాశం వచ్చినట్టు భావించి పనిచేయండి అని లక్ష్మీనారాయణ […]
కులాలకు మతాలకు అతీతం అని చెప్పుకున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల బరిలో దిగే సరికి కులం కత్తి తీశారు. రహస్యంగా కుల సమావేశాలు ఏర్పాటు చేసి నేను మీవాడిని, మీ ప్రతినిధిని అంటూ కులం కార్డు విసురుతున్నారు.
వాల్తేరు క్లబ్‌లో నాలుగు రోజుల క్రితం 350 మంది కాపు నేతలతో మాజీ జేడీ రహస్యంగా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో నేను మీ ప్రతినిధిగా పోటీ చేస్తున్నా… కాబట్టి సొంత వ్యక్తికి అవకాశం వచ్చినట్టు భావించి పనిచేయండి అని లక్ష్మీనారాయణ కోరినట్టు చెబుతున్నారు. అదే విధంగా రుషికొండ సమీపంలోని ఒక సాప్ట్‌వేర్ కంపెనీలోనూ ఇదే తరహాలో మాజీ జేడీ కుల సమావేశం ఏర్పాటు చేసి గెలిపించాలని కోరినట్టు చెబుతున్నారు.
కుల పెద్దలతో సమావేశం తప్పు కాదు గానీ… రహస్యంగా ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఇలాంటి సమావేశాలు నిర్వహించినప్పుడే విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విమర్శలకు లక్ష్మీనారాయణ ఎలా స్పందిస్తారో చూడాలి.