హైద‌రాబాద్ టు రాజ‌మండ్రి.... జ‌య‌భేరి డ‌బ్బు ప‌ట్టివేత !

ఏపీలో ఎన్నిక‌ల్లో ప్ర‌లోభాల ప‌ర్వం పుంజుకుంటోంది. టీడీపీ నేత‌లు విచ్చ‌ల‌విడిగా డ‌బ్బు పంపిణీ చేసేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ఇందులో భాగంగా హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర ప్రాంతాల నుంచి డ‌బ్బు త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విష‌యం తెలిసి పోలీసులు జ‌రిపిన దాడుల్లో భారీగా డ‌బ్బు ప‌ట్టుబ‌డింది. తెలుగుదేశం రాజ‌మండ్రి ఎంపీ అభ్య‌ర్థి మాగంటి రూపకు చెందిన డ‌బ్బును హైద‌రాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప‌ట్టుకున్నారు. హైద‌రాబాద్ హైటెక్ సిటీ రైల్వేస్టేష‌న్‌లో ఇద్ద‌రు వ్య‌క్తుల నుంచి రెండు కోట్ల […]

Advertisement
Update:2019-04-03 17:30 IST

ఏపీలో ఎన్నిక‌ల్లో ప్ర‌లోభాల ప‌ర్వం పుంజుకుంటోంది. టీడీపీ నేత‌లు విచ్చ‌ల‌విడిగా డ‌బ్బు పంపిణీ చేసేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ఇందులో భాగంగా హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర ప్రాంతాల నుంచి డ‌బ్బు త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విష‌యం తెలిసి పోలీసులు జ‌రిపిన దాడుల్లో భారీగా డ‌బ్బు ప‌ట్టుబ‌డింది.

తెలుగుదేశం రాజ‌మండ్రి ఎంపీ అభ్య‌ర్థి మాగంటి రూపకు చెందిన డ‌బ్బును హైద‌రాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప‌ట్టుకున్నారు. హైద‌రాబాద్ హైటెక్ సిటీ రైల్వేస్టేష‌న్‌లో ఇద్ద‌రు వ్య‌క్తుల నుంచి రెండు కోట్ల 30 ల‌క్ష‌లు స్వాధీనం చేసుకున్నారు. డ‌బ్బు గురించి వివ‌రాలు ఆరా తీస్తే… రాజ‌మండ్రి ఎంపీగా పోటీ చేస్తున్న మాగంటి రూప‌కు చెందిన డ‌బ్బుగా గుర్తించారు.

మాగంటి రూప ముర‌ళీమోహ‌న్ కోడ‌లు. జ‌య‌భేరి పేరుతో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. జ‌య‌బేరి ప్రాప‌ర్టీస్ లో ప‌నిచేస్తున్న నిమ్మ‌లూరి శ్రీహ‌రి, అరుతి పాండ‌రిలు రెండు బ్యాగుల్లో న‌గ‌దు తీసుకెళ్తున్నారు. జ‌య‌భేరి కార్యాల‌యం నుంచి ఈ న‌గ‌దును రాజ‌మండ్రికి త‌ర‌లిస్తున్నార‌ని తెలిసింది. కారులో తీసుకెళ్తే చెక్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలిసిన వీరు. రైలులో డ‌బ్బు త‌రలించేందుకు ఏర్పాట్లు చేశార‌ని అంటున్నారు. హైటెక్ సిటీ రైల్వే స్టేష‌న్‌లో ట్రైన్ ఎక్కి… అక్క‌డి నుంచి రాజ‌మండ్రి వెళ్లాల‌ని వీరు ప్లాన్ చేశార‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఎన్నిక‌ల నేరం కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు.

Tags:    
Advertisement

Similar News