లోకేష్ లైవ్‌ కట్‌...

తండ్రి సాయంతో ఏకంగా మూడు శాఖలకు మంత్రి అయిన నారా లోకేష్ తన వ్యక్తిగత పనితీరు మాత్రం మెరుగు పరుచుకోలేక పోయారు. మంత్రి అయి ఉండి తన ప్రసంగంలో పొంతన లేని మాటలు మాట్లాడడం లోకేష్‌కు సర్వసాధారణం అయిపోయింది. చాలా మంది ఆయన ప్రసంగాన్ని కంటెంట్‌ కోసం కాకుండా కామెడీ కోసం చూసే పరిస్థితి తెచ్చుకున్నారు. లోకేష్‌ ఈసారి నోరు జారి ఏ డైలాగ్‌ పేల్చుతారా అని నెటిజన్లు ఆసక్తిగా కాపు కాసే పరిస్థితి వచ్చింది. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న లోకేష్.. ప్రచారంలోకి దిగినప్పటి […]

Advertisement
Update:2019-04-02 02:18 IST

తండ్రి సాయంతో ఏకంగా మూడు శాఖలకు మంత్రి అయిన నారా లోకేష్ తన వ్యక్తిగత పనితీరు మాత్రం మెరుగు పరుచుకోలేక పోయారు. మంత్రి అయి ఉండి తన ప్రసంగంలో పొంతన లేని మాటలు మాట్లాడడం లోకేష్‌కు సర్వసాధారణం అయిపోయింది. చాలా మంది ఆయన ప్రసంగాన్ని కంటెంట్‌ కోసం కాకుండా కామెడీ కోసం చూసే పరిస్థితి తెచ్చుకున్నారు.

లోకేష్‌ ఈసారి నోరు జారి ఏ డైలాగ్‌ పేల్చుతారా అని నెటిజన్లు ఆసక్తిగా కాపు కాసే పరిస్థితి వచ్చింది. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న లోకేష్.. ప్రచారంలోకి దిగినప్పటి నుంచి రకరకాల వింత వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఏప్రిల్‌ 9న పోలింగ్‌లో పాల్గొని తనకు ఓటేయాలని పిలుపునివ్వడం, సముద్రపు ఒడ్డున మాత్రమే సాధ్యమైన మచిలీపట్నం పోర్టును సముద్రం లేని తెలంగాణకు కేసీఆర్‌ తీసుకెళ్తారని చెప్పడం, టీడీపీ 1980లోనే పుట్టిందని వెల్లడించడం ఇలా రకరకాలుగా వింత వ్యాఖ్యలు చేస్తూ లోకేష్‌ నవ్వుల పాలవుతున్నారు. లోకేష్‌ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు యూట్యూబ్, ఫేస్‌బుక్‌ , ట్విట్టర్‌ లలో భారీగా పోస్టులు చేస్తున్నారు. ఈనేపథ్యంలో లోకేష్ టీం అప్రమత్తమైంది.

నష్టనివారణ కోసం నారా లోకేష్ ఎన్నికల ప్రచార లైవ్‌ ప్రసారాలను ఆపేసింది. మొన్నటి వరకు నారా లోకేష్‌కు చెందిన ఫేస్ బుక్ అకౌంట్‌లో ఆయన ప్రసంగాన్ని లైవ్ ఇచ్చే వారు. కానీ లోకేష్ ట్రోల్ అవుతుండడంతో ఆయన ప్రసంగాల వీడియోలు
నెటిజన్లకు చిక్కకుండా లైవ్ ప్రసారాన్ని ఆపేశారు.

లోకేష్‌ ఎలాంటి బూతులు లేకుండా ప్రసంగాన్ని పూర్తి చేశారని నిర్దారించుకున్న తర్వాతే వీడియోలను బయటకు వదులుతున్నారు.

ఇప్పటికే యూట్యూబ్‌లో లోకేష్‌ వింత వ్యాఖ్యలను కొందరు అప్‌లోడ్‌ చేయగా వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News