మోహన్‌బాబు వెర్షన్ ఇది

ప్రముఖ నటుడు మోహన్‌బాబుకు చెక్‌ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు ఆయనకు ఈ శిక్ష విధించింది. దర్శకుడు వైవీఎస్ చౌదరికి ఇచ్చిన చెక్‌ బౌన్స్ అయిన కేసులో కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. 2009లో మంచు విష్ణు హీరోగా దర్శకుడు వైవీఎస్‌ చౌదరి సినిమా తీశారు. ఆ సమయంలో మోహన్‌బాబు ఇచ్చిన చెక్‌ బౌన్స్ అవడంతో దర్శకుడు వైవీఎస్ చౌదరి కోర్టును ఆశ్రయించారు. అయితే మోహన్‌ బాబు వెర్షన్‌ మరోలా ఉంది. సలీం సినిమాకు సంబంధించి డబ్బు మొత్తం వైవీఎస్ చౌదరికి ఇచ్చేశామని చెబుతున్నారు. […]

Advertisement
Update:2019-04-02 15:23 IST

ప్రముఖ నటుడు మోహన్‌బాబుకు చెక్‌ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు ఆయనకు ఈ శిక్ష విధించింది. దర్శకుడు వైవీఎస్ చౌదరికి ఇచ్చిన చెక్‌ బౌన్స్ అయిన కేసులో కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. 2009లో మంచు విష్ణు హీరోగా దర్శకుడు వైవీఎస్‌ చౌదరి సినిమా తీశారు. ఆ సమయంలో మోహన్‌బాబు ఇచ్చిన చెక్‌ బౌన్స్ అవడంతో దర్శకుడు వైవీఎస్ చౌదరి కోర్టును ఆశ్రయించారు.

అయితే మోహన్‌ బాబు వెర్షన్‌ మరోలా ఉంది. సలీం సినిమాకు సంబంధించి డబ్బు మొత్తం వైవీఎస్ చౌదరికి ఇచ్చేశామని చెబుతున్నారు. సలీం సినిమా తర్వాత వైవీఎస్‌ చౌదరి డైరెక్షన్‌లోనే మరో సినిమా తీయాలనుకున్నామని… అందుకు
గాను 40 లక్షల చెక్‌ ఇచ్చినట్టు మోహన్‌ బాబు చెప్పారు.

అయితే మరో సినిమా తీయాలన్న ఆలోచన విరమించుకుని… ఆ విషయాన్ని వైవీఎస్ చౌదరికి చెప్పామని… తాము ఇచ్చిన 40 లక్షల రూపాయల చెక్‌ను బ్యాంకులో వేయవద్దని ముందుగానే చెప్పామని మోహన్‌బాబు చెబుతున్నారు.

కానీ దర్శకుడు వైవీఎస్ చౌదరి కావాలని చెక్‌ను బ్యాంకులో వేశారని దాంతో అది బౌన్స్ అయిందని… ఆ తర్వాత కోర్టులో కేసు వేశారని మోహన్‌బాబు చెబుతున్నారు. కింద కోర్టు ఇచ్చిన తీర్పుపై పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్తామని వివరించారు.

Tags:    
Advertisement

Similar News