ఫ్రస్టేషన్‌తో ఊగిపోతున్న జేసీ
అనంతపురం జిల్లాలో రాజకీయ పరిస్థితులు గతానికి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఓటమి లేని జేసీ కుటుంబం కూడా ఈసారి తడబడుతోంది. గడిచిన ఐదేళ్లలో పదేపదే మీడియా ముందుకు రావడం, కులాల పేరుతో ఇష్టానుసారం మాట్లాడడం, నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడడం జేసీ బ్రదర్స్‌కు అలవాటుగా మారింది. జేసీ బ్రదర్స్ వైఖరి వల్ల దశాబ్దాలుగా వారితో ఉన్న వారు కూడా ఇటీవల దూరంగా జరిగారు. అదే సమయంలో తొలిసారి జేసీ సోదరులు వారి వారసులను రంగంలోకి దింపారు. కానీ అనుకున్నంత […]
అనంతపురం జిల్లాలో రాజకీయ పరిస్థితులు గతానికి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఓటమి లేని జేసీ కుటుంబం కూడా ఈసారి తడబడుతోంది. గడిచిన ఐదేళ్లలో పదేపదే మీడియా ముందుకు రావడం, కులాల పేరుతో ఇష్టానుసారం
మాట్లాడడం, నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడడం జేసీ బ్రదర్స్‌కు అలవాటుగా మారింది.
జేసీ బ్రదర్స్ వైఖరి వల్ల దశాబ్దాలుగా వారితో ఉన్న వారు కూడా ఇటీవల దూరంగా జరిగారు. అదే సమయంలో తొలిసారి జేసీ సోదరులు వారి వారసులను రంగంలోకి దింపారు. కానీ అనుకున్నంత ఈజీగా పరిస్థితి లేదన్నది చాలా మంది అభిప్రాయం. ఓటమి లేకుండా గెలుస్తూ వస్తుండడం వల్లే జేసీ బ్రదర్స్‌కు అహంకారం బాగా పెరిగిందని… ఒకసారి ఓటమి రుచి చూపిస్తే అంతా సెట్ అవుతుందన్న నినాదం ఇప్పుడు కొత్తగా బయలుదేరింది.
ఇదే ఇప్పుడు జేసీ కుటుంబాన్ని కలవరపెడుతోంది. సరిగ్గా వారసులను రంగప్రవేశం చేయిస్తున్న సమయంలోనే ఈ పరిస్థితి ఉండడం వారిని కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రచారంలోనూ పలుచోట్ల ప్రజలు నేరుగా జేసీ కుటుంబ సభ్యులను
నిలదీస్తున్నారు. ఆ సమయంలో జేసీ కుటుంబ సభ్యులు సహనం కోల్పోతున్నారు. ఆ మధ్య జేసీ పవన్ కూడా ఒక సర్పంచ్ గ్రామానికి నీరు అడిగినందుకు బెదిరించారు.
ఇటీవలే ఒక గ్రామంలో ఒకవ్యక్తి తమకు నీరు రావడం లేదని ప్రశ్నించగా…. జేసీ దివాకర్ రెడ్డి ప్రచార రథం మీద నుంచి పచ్చి బూతులు మాట్లాడారు. పక్కనే మహిళా ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నా సరే జేసీ లెక్కచేయలేదు. తలుచుకునేందుకు కూడా భయమేసే రీతిలో పచ్చి బూతులు తిట్టారు.
గు… పడల… దొ…తా…, నీ అమ్మ… నా కొ…, ఇలా నోటికొచ్చిన మాటలు తిట్టారు. దాంతో గ్రామస్తులంతా నిర్ఘాంతపోయారు.
ఇలా జేసీ బ్రదర్స్ పదేపదే సహనం కోల్పోతుండడం, ఒకసారి ఓడిస్తే పోలా అన్న ప్రజల అభిప్రాయం జేసీ బ్రదర్స్‌కు ఇబ్బందిగా మారింది. ఈ ప్రతికూల పరిస్థితుల వల్లే జేసీ ఫ్యామిలీ సహనం కోల్పోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.