అతిరథులు వచ్చినా... అందలం అందదా...?

ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, శాసన సభ ఎన్నికలలో ప్రచారం హోరెత్తింది. దేశ రాజకీయాలలో అతిరధ మహారథులు అనుకుంటున్న నాయకులు చంద్రబాబుకు అండగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఆంధ్రప్రదేశ్ లో పలు సభలలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబు నాయుడుకు తిరిగి పట్టం కట్టాలని ప్రచారం చేసారు. మైనారీటీలు ఎక్కువగా ఉన్న రాయాలసీమ జిల్లాలలో ఫరూక్ అబ్దుల్లా తెలుగుదేశం తరఫున ప్రచారం చేసారు. అయితే ఈ ప్రచారానికి మాత్రం […]

Advertisement
Update:2019-04-01 04:23 IST

ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, శాసన సభ ఎన్నికలలో ప్రచారం హోరెత్తింది. దేశ రాజకీయాలలో అతిరధ మహారథులు అనుకుంటున్న నాయకులు చంద్రబాబుకు అండగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఆంధ్రప్రదేశ్ లో పలు సభలలో పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబు నాయుడుకు తిరిగి పట్టం కట్టాలని ప్రచారం చేసారు. మైనారీటీలు ఎక్కువగా ఉన్న రాయాలసీమ జిల్లాలలో ఫరూక్ అబ్దుల్లా తెలుగుదేశం తరఫున ప్రచారం చేసారు. అయితే ఈ ప్రచారానికి మాత్రం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశించిన స్థాయిలో ఫలితం దక్కదని అంటున్నారు.

దీనికి కారణం మొన్నటి వరకూ మైనారీటీలకు వ్యతిరేకమైన భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపిన చంద్రబాబు నాయుడిని రాయలసీమలోని మైనారీటీలు ఎలా విశ్వసిస్తారని అంటున్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఎన్ని మాటలు చెప్పినా మైనారీటీలు మాత్రం ఆయన ఉపన్యాసాలను కొట్టిపారేస్తున్నారంటున్నారు.

ఉత్తరాదివారు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి వచ్చి విశాఖపట్నంలో స్ధిరపడిన వారిని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను విశాఖలో ఎన్నికల ప్రచారానికి తీసుకు వచ్చారు. వారిద్దరూ విశాఖ సభలో ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు.

అయితే ఉత్తరాదిలో భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్న అనుకూలత విశాఖలో ఉన్న ఉత్తరాది ఓటర్లపై పడుతుందని, వారంతా బిజేపీని వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపరని స్థానిక రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉత్తరాది నుంచి అతిరథ మహారథులైన వారిని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార బరిలో దింపినా తెలుగుదేశం పార్టీకి అది కలిసిరాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News