వెండితెర బాబును విశ్వసించటం లేదా?

తెలుగు చలన చిత్ర పరిశ్రమ. ఈ పరిశ్రమ నుంచి వచ్చిన నందమూరి తారక రామారావు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి ఎన్టీఆర్ మరణించే వరకూ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆ పార్టీ వెంటే నడిచింది. అనంతరం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోకి వచ్చాక కూడా చిత్ర పరిశ్రమ అంతా చంద్రబాబుకు అండగా ఉంది. తెలుగు చలనచిత్ర సీమకు చెందిన అనేక మంది నటీనటులు చంద్రబాబు నాయుడికి “అన్ని రకాలుగా” […]

Advertisement
Update:2019-04-01 05:14 IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమ. ఈ పరిశ్రమ నుంచి వచ్చిన నందమూరి తారక రామారావు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి ఎన్టీఆర్ మరణించే వరకూ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆ పార్టీ వెంటే నడిచింది. అనంతరం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోకి వచ్చాక కూడా చిత్ర పరిశ్రమ అంతా చంద్రబాబుకు అండగా ఉంది.

తెలుగు చలనచిత్ర సీమకు చెందిన అనేక మంది నటీనటులు చంద్రబాబు నాయుడికి “అన్ని రకాలుగా” ఉపయోగపడ్డారు. సినీనటులకు రాజకీయంగా అవకాశం కల్పించిన ఎన్.టి. రామారావుకు… అల్లుడు నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచిన సమయంలో కూడా సినీ పరిశ్రమ చంద్రబాబు వెంటే ఉంది.

గడచిన రెండు దశాబ్దాలుగా అనేక మంది నటీనటులను చంద్రబాబు నాయుడు తన అధికారం కోసం వాడుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ పరిస్దితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన హీరో- హీరోయిన్లు, ప్రముఖ కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో ఉద్దండులైన మోహన్ బాబు, జయసుధ, ఆలీ, పోసాని క్రిష్ణమురళి, జీవిత, రాజశేఖర్… వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు పృధ్వీ, శివాజీరాజ, దర్శకుడు ఎస్వీ క్రిష్ణారెడ్డి, అచ్చిరెడ్డి వంటి వారు కూడా వైఎస్ ఆర్ సీపీకి మద్దతుగా నిలబడ్డారు.

ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి సినీ పరిశ్రమ నుంచి మద్దతు తెలుపుతున్నవారు లేకుండా పోయారు. దీనికి కారణం చంద్రబాబు నాయుడేనని…. సినీ పరిశ్రమలోని వారిని తన అవసరాల కోసం వాడుకుని తర్వాత వదిలి వేయడం వల్ల పరిశ్రమలో ఎవ్వరూ చంద్రబాబును నమ్మడం లేదని అంటున్నారు.

ప్రముఖ కమేడియన్ ఆలీ రెండు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిలబడి ప్రచారం చేసినా ఆయనకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదని ప్రముఖ నటి జయసుధ విమర్శించారు.

అలాగే జయప్రద, మోహన్ బాబు వంటివారిని వాడుకుని కూరలో కరివేపాకులా తీసేసారనే కోపం చిత్ర పరిశ్రమలో వారికి ఉందని, ఆ కారణంగానే వెండితెర నుంచి చంద్రబాబుకు ఎవరూ మద్దతు పలకటం లేదని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News