విజయసాయి రెడ్డిపై ఎస్పీ వెంకటరత్నం పిర్యాదు
సీఈసీ ఆదేశాలతో బదిలీ వేటుకు గురైన శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై పిర్యాదు చేశారు. అసత్య ఆరోపణలు చేసి తన బదిలీకి కారకుడయ్యారంటూ ఆయనపై శ్రీకాకుళం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. గత 30 ఏళ్లుగా నిజాయితీ పని చేస్తున్న తనపై అసత్య ఆరోపణలతో బురదజల్లి తన నిజాయితీపై మచ్చ తెచ్చారని ఆయన ఆ పిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే విజయసాయి రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే వెంకటరత్నం కేంద్ర ఎన్నికల […]
సీఈసీ ఆదేశాలతో బదిలీ వేటుకు గురైన శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై పిర్యాదు చేశారు. అసత్య ఆరోపణలు చేసి తన బదిలీకి కారకుడయ్యారంటూ ఆయనపై శ్రీకాకుళం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు.
గత 30 ఏళ్లుగా నిజాయితీ పని చేస్తున్న తనపై అసత్య ఆరోపణలతో బురదజల్లి తన నిజాయితీపై మచ్చ తెచ్చారని ఆయన ఆ పిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే విజయసాయి రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే వెంకటరత్నం కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ సత్య దూరమని.. ఎలాంటి విచారణకైనా సిద్దమని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
కాగా, నారాయణ విద్యాసంస్థలకు చెందిన దాదాపు 50 కోట్ల రూపాయల నగదును ఎస్పీ ఎస్కార్ట్ ఇచ్చి తరలించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డి సీఈసీకి పిర్యాదు చేశారు. ఇవాళ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై కూడా వైసీపీ ఈసీ దృష్టికి తీసుకెళ్లనుంది.